News February 22, 2025
గ్రూప్-2 పరీక్షలపై అనంతపురం కలెక్టర్ క్లారిటీ!

రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం జరగవలసిన గ్రూప్-2 పరీక్షలు రద్దు అయ్యాయని సోషల్ మీడియాలో వస్తున్న వాటికి అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. గ్రూప్-2 పరీక్షలను ప్రభుత్వం రద్దు చేయలేదని తెలిపారు. పరీక్షలు యథావిధిగా జరుగుతాయని వెల్లడించారు. పరీక్షలకు హాజరయ్యే వారికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. అయితే పరీక్షలను వాయిదా వేయాలని APPSCకి ప్రభుత్వం లేఖ రాసిన విషయం తెలిసిందే.
Similar News
News March 26, 2025
అనంత: ‘రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి’

క్షేత్రస్థాయిలో ఎలాంటి పెండింగ్ లేకుండా రెవెన్యూ సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వివిధ ప్రాజెక్టులకు భూసేకరణ, భూ అప్పగింత, రీసర్వే, రెవెన్యూ సర్వీసులు, PGRS, తదితర అంశాలపై RDOలు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
News March 25, 2025
ఆ YCP నేతకు తాడిపత్రిలోకి NO ENTRY

తాడిపత్రికి చెందిన YCP ముస్లిం మైనార్టీ నేత ఫయాజ్ బాషాను పది రోజులపాటు తాడిపత్రిలోకి రాకుండా పోలీసులు బహిష్కరించారు. గత 3రోజుల క్రితం ఫయాజ్ బాషా, JC ప్రభాకర్ రెడ్డి మధ్య వివాదం జరిగిన విషయం తెలిసిందే. రంజాన్ సందర్భంగా.. ఎలాంటి అల్లర్లు జరగకూడదనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఫయాజ్ బాషాను పోలీసులు అనంతపురం తరలించారు.
News March 25, 2025
తాడిపత్రిలో పెద్దారెడ్డికి నో ఎంట్రీ బోర్డ్!

తాడిపత్రి నియోజకవర్గంలోని YCP శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. కీలక నేతలంతా యాక్టివ్‌గా లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలూ పెద్దగా జరగడంలేదు. శాంతి భద్రతల సమస్య దృష్ట్యా తనను తాడిపత్రికి వెళ్లకూడదంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. 9నెలల నుంచి ఇదే సాగుతోంది. ఆయన నియోజకవర్గానికి రావాలనుకుంటున్నా రాలేకపోతున్నారు. మరోవైపు దూకుడుతో JC తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.