News March 12, 2025
గ్రూప్-2 ఫలితాల్లో కాసింపల్లి వాసికి 76వ ర్యాంకు

రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గ్రూప్-2 ఫలితాలలో భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాసింపల్లి గ్రామానికి చెందిన శనిగరపు ప్రవీణ్ రాష్ట్ర స్థాయి 76వ ర్యాంక్ సాధించి కాళేశ్వరం జోన్ టాపర్‌గా నిలిచాడు. గతంలో పంచాయతీ సెక్రటరీగా, వీఆర్ఓగా, గ్రూప్-4 జూనియర్ అసిస్టెంట్‌గా 4 ఉద్యోగాలు సాధించి ప్రస్తుతం పదోన్నతి పొంది హైదరాబాదులో సీనియర్ అసిస్టెంటుగా పనిచేస్తున్నాడు.
Similar News
News March 17, 2026
డ్రగ్స్ కేసుపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు

TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యూచర్ సిటీ సీపీ సుధీర్ బాబు నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. గత శనివారం TDP MP పుట్టా మహేశ్, BRS మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేశ్, ఢిల్లీ వ్యాపారి నమిత్ సహా మరికొందరు ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు. ఈ కేసులో మహేశ్‌కు స్టేషన్ బెయిల్ రాగా రోహిత్, రితేశ్, నమిత్‌కు రిమాండ్ విధించి చంచల్‌గూడ జైలుకు తరలించారు.
News March 17, 2026
రాజకీయాలకు వర్మ దూరం?.. వ్యాపారం వైపు అడుగులు!

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ తర్వాత మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ రాజకీయంగా ప్రాధాన్యత కోల్పోయారు. పదవుల కోసం ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో వ్యాపార రంగం వైపు మళ్లారు. తాజాగా కాకినాడలో ఫైవ్‌స్టార్ హోటల్‌కు దరఖాస్తు చేశారు. ప్రభుత్వం 3.4 ఎకరాల భూమిని కేటాయిస్తూ, రాయితీలతో కూడిన జీవో జారీ చేసింది. దీంతో ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పి హోటల్ రంగంలోకి అడుగుపెట్టారని టాక్ నడుస్తోంది.
News March 17, 2026
TGRJC-CET-2026 నోటిఫికేషన్ విడుదల

TG: రాష్ట్రంలో 35 గురుకుల జూ.కాలేజీలు, 93 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ ఫస్టియర్ ప్రవేశానికి ‘TGRJC-CET-2026’ నోటిఫికేషన్ విడుదలయింది. MPC, BPC, MEC, CEC గ్రూప్స్‌లో ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్టు మే3న నిర్వహిస్తారు. APR15 వరకు రూ.200 ఫీజు చెల్లించి దరఖాస్తు చేయొచ్చు. మెరిట్, రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయిస్తారు. దరఖాస్తు చేయాల్సిన వెబ్‌సైట్: https://tgrjc.cgg.gov.in/TGRJCWEB/


