News March 11, 2025

గ్రూప్-2 ఫలితాల్లో కోదాడ వాసికి ప్రథమ ర్యాంక్

image

కోదాడలోని కేఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎన్. రమణారెడ్డి కుమారుడు వెంకట హరవర్ధన్ రెడ్డి గ్రూప్-2 ఫలితాల్లో 447.080 మార్కులు పొంది రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా హరవర్ధన్ రెడ్డిని కళాశాల అధ్యాపకులు జి.లక్ష్మయ్య, ఆర్. పిచ్చి రెడ్డి, వేముల వెంకటేశ్వర్లు, జి. యాదగిరి, వి. బల భీమ రావులు అభినందించారు.

Similar News

News January 19, 2026

పెద్దపల్లి: ‘అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి’

image

అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి.వేణు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం పెద్దపల్లి కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా అదనపు కలెక్టర్ డి.వేణు ప్రజల నుంచి దరఖాస్తులు, ఫిర్యాదులు స్వీకరించారు.

News January 19, 2026

ఉన్నావ్ అత్యాచార కేసు.. కుల్దీప్ సెంగార్‌కు చుక్కెదురు

image

ఉన్నావ్ <<18703366>>అత్యాచార<<>> ఘటనలో ప్రధాన నిందితుడు, మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. బాధితురాలి తండ్రి కస్టోడియల్ డెత్ కేసులో విధించిన పదేళ్ల జైలు శిక్షను నిలిపివేసేందుకు కోర్టు నిరాకరించింది. శిక్షను సవాలు చేస్తూ సెంగార్ దాఖలు చేసిన పిటిషన్‌ను తగిన సమయంలో విచారిస్తామని స్పష్టం చేసింది. మరోవైపు అతడికి బెయిల్ ఇచ్చేందుకూ ధర్మాసనం అంగీకరించలేదు.

News January 19, 2026

వేమన గొప్ప దార్శనికుడు: కడప ఎస్పీ

image

యోగి వేమన గొప్ప సంఘసంస్కర్త, దార్శనికుడు అని కడప ఎస్పీ నచి కేత్ కొనియాడారు. యోగి వేమన జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. 350 సంవత్సరాల క్రితమే సమాజంలోని మూఢనమ్మకాల నిర్మూలించేందుకు కృషి చేసిన గొప్ప వ్యక్తి అని చెప్పారు. ఆయన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు.