News March 11, 2025
గ్రూప్-2 ఫలితాల్లో కోదాడ వాసికి ప్రథమ ర్యాంక్

కోదాడలోని కేఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎన్. రమణారెడ్డి కుమారుడు వెంకట హరవర్ధన్ రెడ్డి గ్రూప్-2 ఫలితాల్లో 447.080 మార్కులు పొంది రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా హరవర్ధన్ రెడ్డిని కళాశాల అధ్యాపకులు జి.లక్ష్మయ్య, ఆర్. పిచ్చి రెడ్డి, వేముల వెంకటేశ్వర్లు, జి. యాదగిరి, వి. బల భీమ రావులు అభినందించారు.
Similar News
News March 26, 2025
NLG: ధాన్యం కొనుగోళ్లకు కసరత్తు

నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతేడాది యాసంగిలో ఏప్రిల్ మొదటి వారం వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని రైతుల నుంచి విమర్శలు రాగా.. ఈసారి ఆ సమస్య రాకుండా ముందస్తుగానే జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తుంది. జిల్లాలో ఈ సీజన్లో 11.26 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా.. 12.14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేశారు.
News March 26, 2025
సీజన్ ముగిసిన.. రైతుకు దక్కని భరోసా!

నల్గొండ జిల్లాలో రైతు భరోసా కోసం రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. ఇప్పటివరకు యాసంగి సీజన్‌కు సంబంధించి మూడెకరాల లోపు 2, 76,694 మంది ఖాతాల్లో మాత్రమే ప్రభుత్వం నిధులు జమ చేసింది. మూడు ఎకరాలకు పైగా ఉన్న సుమారు 3. 30 లక్షల మంది రైతులు రైతు భరోసా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. సీజన్ ముగిసినా ఎప్పుడు ఇస్తారోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
News March 26, 2025
నల్గొండలో ఈనెల 27న జాబ్ మేళా

పలు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించేందుకుగాను ఈనెల 27న నల్గొండ పట్టణంలోని ఐటీఐ క్యాంపస్‌లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారిని పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్ మేళాలో ఎంపిక అయినవారు నల్గొండ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.