News March 12, 2025
గ్రూప్-2 ఫలితాల్లో సత్తా చాటిన ADB బిడ్డ

బజార్హత్నూర్కు చెందిన బిట్లింగ్ లక్ష్మణ్, నీల దంపతుల కుమారుడు ఉదయ్ 404 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 51వ ర్యాంక్ సాధించి తమ ప్రతిభ కనబర్చారు. ఉదయ్ పంచాయతీ కార్యదర్శి, ఫారెస్ట్ బీట్ అధికారి, వీఆర్వో, గ్రూప్ -4, సింగరేణి (ఎస్సీసీఎల్ )జాబ్ సంపాదించి మరోపక్క గ్రూప్2కు సన్నద్ధమయ్యాడు. మంగళవారం వెలువడిన గ్రూప్2 ఫలితాల్లో ఉద్యోగం సాధించడం పట్ల అభ్యర్థుల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
Similar News
News March 25, 2025
ఆదిలాబాద్: బాధిత కుటుంబానికి రూ.8 లక్షల చెక్కు

గత సంవత్సరం తాంసి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ గుండెపోటుతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ గంగన్న కుటుంబానికి ప్రభుత్వపరంగా వచ్చే అన్ని సహాయ సహకారాలు సకాలంలో అందజేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సిబ్బందిని ఆదేశించారు. హెడ్ కానిస్టేబుల్ గంగన్న భార్య ప్రమీలకు మంగళవారం ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.8 లక్షల చెక్కును ఎస్పీ అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు.
News March 25, 2025
ఆదిలాబాద్‌కు వచ్చిన కేంద్ర బృందం సభ్యులు

జిల్లాలోని నార్నూర్ పర్యటనలో భాగంగా మంగళవారం కేంద్ర బృందం సభ్యులు ఆదిలాబాద్‌కువచ్చారు. డైరెక్టర్ మృత్యుంజయ ఝా, శుభోద్ కుమార్ డిప్యూటీ సెక్రటరీలను స్థానిక పెన్‌గంగా గెస్ట్ హౌస్‌లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా మర్యాద పూర్వకంగా కలసి పూలమొక్కను, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా వారితో పలు అంశాలపై చర్చించారు.
News March 25, 2025
ADB: నేటితో ముగియనున్న డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు నేటితో ముగుస్తుందని అధికారులు తెలిపారు. విద్యార్థులు త్వరగా ఫీజు చెల్లించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ అపార్ ఐడీని ఆధార్ కార్డ్ జిరాక్స్‌ను కళాశాలల్లో ఇచ్చి లింక్ చేసుకోవాలని పేర్కొన్నారు.