News May 19, 2024

గ్రూప్-2 మెయిన్స్‌కు ఉచిత శిక్షణ

image

ఎంవీపీ కాలనీలోని సర్దార్ గౌతు లచ్చన్న ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా గ్రూప్-2 మెయిన్స్ ఉచిత శిక్షణ అందించనున్నారు. మెయిన్స్‌కు అర్హత సాధించిన బీసీ, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు శిక్షణకు అర్హులని స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎస్.శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 22వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. 60 మందిని ఎంపిక చేసి నెలరోజులు శిక్షణ అందిస్తరు.

Similar News

News October 27, 2025

రుషికొండ బీచ్‌లో పరిస్థితులు పరిశీలించిన డీఐజీ

image

మొంథా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రుషికొండ బీచ్‌ ప్రాంతాన్ని విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జెట్టి, అడిషనల్‌ ఎస్పీ మధుసూదన్‌ పరిశీలించారు. బీచ్‌ తీర ప్రాంతంలో గాలులు బలంగా వీయడంతో భద్రతా ఏర్పాట్లు సమీక్షించారు. పర్యాటకులు, మత్స్యకారులను సముద్ర తీరాలకు వెళ్లవద్దని సూచించారు. పోలీసులు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

News October 27, 2025

విశాఖ: మొంథా తుఫాను.. అప్రమత్తమైన వైద్య సిబ్బంది

image

మొంథా తుఫానుపై వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బందిని DMHO జగదీశ్వరరావు అప్రమత్తం చేశారు. 54 హెల్త్ వెల్‌నెస్, 66 పట్టణ, 9 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో మంచినీటి వనరులను బ్లీచింగ్ చేయాలని, అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ఏడు 104, పదహారు 108, ఇరవై మూడు 102 తల్లి బిడ్డ వాహనాలను తుఫాను ప్రాంతాల్లో ఫిషెర్మెన్ డిపార్ట్మెంట్‌తో కలిసి బోట్ క్లీనిక్స్‌గా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.

News October 27, 2025

ఆంధ్ర విశ్వవిద్యాలయానికి రేపు సెలవు

image

మొంథా తుపాన్ ప్రభావంతో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి మంగళవారం సెలవు ప్రకటించారు. ఈ మేరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే విద్యార్థులకు తరగతుల రద్దు చేశారు. విద్యార్థులను హాస్టల్స్‌కు పరిమితం కావాలని అధికారులు సూచించారు. తుఫాను తీవ్రత పెరగడం, వర్షం అధికమవడంతో వర్సిటీ అధికారులు, ఉద్యోగులకు సైతం రేపు సెలవు ప్రకటించారు.