News February 19, 2025

గ్రూప్-2 మెయిన్స్ వాయిదా వేయాలని విజయనగరంలో ఆందోళన

image

ఈనెల 23న జరగబోయే గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలని విజయనగరంలో అభ్యర్థులు బుధవారం ఆందోళన చేపట్టారు. రోస్టర్ విధానంపై కోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో తీర్పు వెలువడిన తర్వాతే పరీక్ష నిర్వహించాలని కోరుతున్నారు. తక్షణమే పరీక్ష నిర్వహిస్తే అభ్యర్థులు నష్టపోతారన్నారు. కేసులన్నీ పరిష్కరించి ప్రశాంత వాతావరణంలో పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కోట జంక్షన్ వరకు ర్యాలీ చేశారు.

Similar News

News March 27, 2025

విజయనగరం జిల్లాపై సీఎం స్పెషల్ ఫోకస్

image

విజయనగరం జిల్లాలో సాగునీటి కష్టాలు తీరనున్నాయి. ప్రధాన ప్రాజెక్టులైన తోటపల్లికి రూ.105కోట్లు, తారకరామసాగర్‌కు రూ.807కోట్లు ఇవ్వనున్నట్లు CM చంద్రబాబు ప్రకటించారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో జిల్లాలోని సాగునీటి వనరులపై CM ఆరా తీశారు. ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే సెంట్రల్ ట్రైబుల్ యునివర్సిటీకి రూ.29కోట్లు ఇస్తామన్నారు.

News March 27, 2025

VZM: ‘ధాన్యం కొనుగోలు కేంద్రాలను మూసివేస్తున్నాం’

image

ఖరీఫ్ 2024-25 సీజన్‌కు గాను జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చివరి దశకు చేరుకున్నందున ఈనెల 31న కేంద్రాలను మూసి వేస్తున్నామని కలెక్టర్ అంబేడ్కర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 487 కేంద్రాల నుంచి 3.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, రైతుల ఖాతాల్లో మద్దతు ధర రూ.768 కోట్లు, GLT చెల్లింపులకు రూ.12కోట్లు జమ చేశామన్నారు. రైతులు వద్ద ధాన్యం ఉంటే నిర్ణీత గడువులోగా విక్రయించాలన్నారు.

News March 27, 2025

VZM: పర్యాటక రంగంలో జిల్లా ఆదాయాన్ని పెంచుతాం: కలెక్టర్

image

విజయనగరం జిల్లాలో పైడిత‌ల్లి ఆల‌యంతో పాటు రామ‌తీర్ధాన్ని ప‌ర్యాట‌క ఆధ్యాత్మిక క్షేత్రాలుగా అభివృద్ధి చేసి జిల్లాలో ఆదాయం పెంచుతామ‌ని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. అమరావతిలో బుధవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో ఈ అంశాన్ని ప్రస్థావించారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి వస్తున్న దృష్ట్యా ఉపాధి అవకాశాలు, ఆతిధ్య రంగం అభివృద్ధిలో భాగంగా వాణిజ్యం, హోటళ్ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామన్నారు.

error: Content is protected !!