News March 15, 2025
గ్రూప్ – 3లో ఉద్యోగం సాధించిన అయిజ యువకుడు

అయిజ తెలుగుపేట కాలనీకి చెందిన దరెన్న, కృష్ణమ్మ దంపతుల కుమారుడు హరికృష్ణ ఇటీవల వెలువడిన గ్రూప్ – 3 ఫలితాల్లో 433వ ర్యాంక్ సాధించి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు. 2015-16లో బిటెక్ చేసి సాఫ్ట్ వేర్ రంగం వైపు వెళ్లకుండా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో గ్రూప్స్ కు ప్రిపేర్ అయ్యాడు. గ్రూప్ 3 జనరల్ విభాగంలో 433 వ ర్యాంకు సాధించాడు. దీంతో పలువురు హరికృష్ణను అభినందించారు.
Similar News
News November 26, 2025
హార్టికల్చర్ పరిశోధనా కేంద్రాన్ని సందర్శించిన పురందీశ్వరి

రాజమండ్రి ఎంపీ డాక్టర్ దగ్గుబాటి పురందీశ్వరి బుధవారం రాజమండ్రి రూరల్ వేమగిరిలోని హార్టికల్చర్ పరిశోధనా కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న పరిశోధనలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నర్సరీ రైతు ఈ పరిశోధనా కేంద్రం ద్వారా ఉపయోగం పొందాలని ఆమె అన్నారు. ప్రతి నర్సరీ రైతు విధిగా తమ పేరును హార్టికల్చర్ ఏడీ ఆఫీసులో నమోదు చేసుకోవాలని సూచించారు.
News November 26, 2025
పెద్దపల్లి: ‘బీసీ ఉద్యమాలలో మహిళలు భాగస్వామ్యం కావాలి’

పెద్దపల్లి ఆర్యవైశ్య భవనంలో నిర్వహించిన సెమినార్లో ‘బీసీ ఉద్యమాల్లో మహిళల పాత్ర’ అంశంపై చర్చ జరిగింది. బీసీ హక్కుల సాధనలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరని నాయకులు అభిప్రాయపడ్డారు. బీసీలకు హామీ ఇచ్చిన 42% రిజర్వేషన్ను 22%కు తగ్గించడం అన్యాయమని, కామారెడ్డి డిక్లరేషన్ అమలయ్యే వరకు పోరాటాలు కొనసాగుతాయని ఉద్యమకారుడు శ్రీమన్నారాయణ స్పష్టం చేశారు.
News November 26, 2025
సూర్యాపేట: పంచాయతీ ఎన్నికలు.. కలెక్టర్ ఆదేశాలు

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. బుధవారం సూర్యాపేటలోని కలెక్టరేట్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత నామినేషన్లు స్వీకరించనున్న ఆర్వోలు, ఏఆర్వోలు, ఎంపీడీవోలకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మొదటి విడతలో 8 మండలాల్లో 159 జీపీ, 1,442 వార్డులకు ఎన్నికలు జరుగుతాయన్నారు.


