News November 13, 2024

గ్రూప్-3 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి: KNR కలెక్టర్ 

image

ఈనెల 17, 18వ తేదీల్లో జిల్లాలో గ్రూప్-3 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. గ్రూప్-3 పరీక్షకు విధులు కేటాయించిన అధికారులకు బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అభ్యర్థులు నిర్ణీత సమయంలోగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

Similar News

News December 18, 2025

ఒక్క ఓటుతో శ్రీరాములపల్లి సర్పంచ్‌గా రమ్య

image

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గుత్తికొండ రమ్య ఒక్క ఓటుతో విజయం సాధించారు. తన ప్రత్యర్థి BRS అభ్యర్థి తిప్పరబోయిన శారదపై ఒక్క ఓటు మెజార్టీతో గెలుపొందారు. రీకౌంటింగ్ జరిగినా ఒక ఓటు తేడా ఉండడంతో గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.

News December 17, 2025

కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ పమేలా సత్పతి

image

ముడో విడత గ్రామ పంచాయతీల ఎన్నికలు పూర్తయిన తరువాత కౌటింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. జమ్మికుంట మండలం మాచనపల్లి, జగ్గయ్య పల్లె గ్రామంలో కౌటింగ్ ప్రక్రియను పరిశీలించినారు. అనంతరం వీణవంక మండలం రెడ్డిపల్లి, చల్లూర్, మామిడాలపల్లెలోనూ కౌటింగ్ విధానంను పర్యవేక్షించి ఈ మేరకు అధికార్లకు పలు సూచనలు చేశారు.

News December 17, 2025

కరీంనగర్ జిల్లాలో 86.42% పోలింగ్ నమోదు

image

కరీంనగర్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 5 మండలాల్లో తుది పోలింగ్ శాతం వివరాలను అధికారులు వెల్లడించారు. మొత్తం 86.42% పోలింగ్ కాగా, ఇల్లందకుంటలో 87.05%, హుజూరాబాద్ లో 85.94%, జమ్మికుంటలో 85.72%, వీణవంకలో 85.87%, సైదాపూర్ లో 87.85% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. మొత్తం 111 గ్రామ పంచాయితీల్లో 165046 ఓట్లకు గాను 142637 ఓట్లు పోలయ్యాయి.