News December 13, 2024
గ్రూప్-II పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు: WGL సీపీ
వరంగల్ పోలీస్ కమిషనరేట్ జిల్లా పరిధిలో రేపు డిసెంబర్ 15 నుంచి 16 వరకు జరిగే TGPSC గ్రూప్-II నిర్వహించే పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS యాక్ట్-2023(భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమలులో ఉంటుందని సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. సభలు, సమావేశాలు, ర్యాలీ నిషేధమని, అతిక్రమిస్తే చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఓ ప్రకటనలో తెలిపారు.
Similar News
News December 27, 2024
WGL: రేపటి నుంచి మూడు రోజులు వరుస సెలవులు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు వరుసగా 3 రోజుల సెలవులు రానున్నాయి. శనివారం వారాంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు, సోమవారం అమావాస్య సందర్భంగా మార్కెట్ను మూసి వేస్తున్నట్లు మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి నిర్మల తెలిపారు. ఈ విషయాన్ని రైతులు గమనించి మూడు రోజులు సరకులు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు.
News December 27, 2024
వరంగల్ మార్కెట్లో చిరు ధాన్యాల ధరల వివరాలు
వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈరోజు వివిధ రకాల చిరు ధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. శుక్రవారం క్వింటా మొక్కజొన్న ధర రూ.2,505 పలకగా ఈరోజు రూ.2,490 ధర పలకింది. సూక పల్లికాయ ధర రూ. 6,200, పచ్చి పల్లికాయ రూ.5,200 పలికాయి. అలాగే కొత్త 341 రకం మిర్చి రూ.14వేలు, కొత్త తేజ మిర్చి రూ. 16,016, దీపిక మిర్చి రూ.13 వేలు పలికినట్లు రైతులు తెలిపారు.
News December 27, 2024
నల్లబెల్లి మండలంలో పెద్ద పులులు.. జాగ్రత్త!
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో మగ, ఆడ పెద్ద పులులతో పాటు పులి కూన సంచరిస్తున్న అడుగు జాడలు వెలుగులోకి వచ్చాయి. నల్లబెల్లి మండలం కొండాపురంలో ఆడ పులి, దాని బిడ్డ పులి కూన సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. అంతేకాకుండా రుద్రగూడెం వైపు మగ పులి ఉన్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.