News November 7, 2024

గ్రూప్-III పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలి: నిర్మల్ కలెక్టర్

image

గ్రూప్-III పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లో గ్రూప్-III పరీక్షల నిర్వహణపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌తో కలిసి ఆమె సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్ III పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.

Similar News

News October 16, 2025

ఆదిలాబాద్ ఇన్‌ఛార్జ్ డీపీఆర్ఓగా విష్ణువర్ధన్

image

ఆదిలాబాద్ ఇన్‌ఛార్జ్ జిల్లా పౌర సంబంధాల అధికారి (డిపిఆర్ఓ)గా ఎల్చల విష్ణువర్ధన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ రాజార్షి షాను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. కలెక్టర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పౌర సంబంధాల విభాగం పనితీరు మరింత ప్రభావవంతంగా ఉండేలా కృషి చేయాలని సూచించారు.

News October 16, 2025

ఫ్లాగ్ డే వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలి: ADB SP

image

ఫ్లాగ్ డే వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ప్రజాసేవలో అమరులైన జిల్లా పోలీసుల జ్ఞాపకార్థం పలు కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అక్టోబర్ 21న ఫ్లాగ్ డే ఉంటుందన్నారు. పోలీస్ పరేడ్ మైదానంలో ఈ నెల 22న మెగా రక్తదానం, 23న ఓపెన్ హౌస్, పట్టణంలో సైకిల్ ర్యాలీ, 24న 5కే రన్ చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

News October 16, 2025

ADB: ఆ కుటుంబం ఊపిరి తీసిన రహదారులు

image

వరుస రోడ్డు ప్రమాదాలు ఆ కుటుంబం ఉసురు తీశాయి. కొన్నేళ్ల కిందట పందులు అడ్డు రావడంతో జరిగిన ప్రమాదంలో స్టీఫెన్ భార్య వాహనంపై నుంచి జారిపడి చనిపోయారు. ఈ విషాదం మరువక ముందే, బుధవారం భిక్కనూరులో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో స్టీఫెన్, ఆయన పెద్ద కుమార్తె జాస్లీన్, ఆమె ఇద్దరు పిల్లలు కూడా మృతి చెందారు. వరుసగా ముగ్గురు కుటుంబ సభ్యులు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.