News March 12, 2025
గ్రూప్2 ఫలితాల్లో.. ADB వాసికి STATE 5TH ర్యాంక్

గ్రూప్2 ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువకులు సత్తా చాటారు. ఇందులో భాగంగా తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన చింతలపల్లి వెంకట్ రెడ్డి కుమారుడు చింతలపల్లి ప్రీతంరెడ్డి గ్రూప్2 ఫలితాల్లో 431 మార్కులు సాధించారు. కాగా రాష్ట్రస్థాయిలో ఐదో ర్యాంకు స్థానంలో నిలిచారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందించారు.
Similar News
News October 31, 2025
ADB: ఏకలవ్య గురుకులాల ప్రిన్సిపల్స్తో కలెక్టర్ సమీక్ష

కలెక్టరేట్లో గురువారం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని కలెక్టర్ రాజర్షి షా నిర్వహించారు. ఏకలవ్య పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు అందిస్తున్న వసతులు, నాణ్యమైన విద్యపై ఆయన ప్రిన్సిపల్స్ను ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సలోని చబ్రా, డీఎంహెచ్వో, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
News October 30, 2025
ఆదిలాబాద్: ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రీషెడ్యూల్

ఆదిలాబాద్ నుంచి గురువారం దయం 8 గంటలకు బయలుదేరాల్సిన ఆదిలాబాద్-నాందేడ్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ సమయాన్ని రైల్వే శాఖ రీషెడ్యూల్ చేసింది. ఈ రైలు ఉదయం 8 గంటలకు బదులుగా ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్ నుంచి బయలుదేరుతుంది. అలాగే, ఈ రైలు సేవలను ముద్ఖేడ్-నాందేడ్-ముద్ఖేడ్ మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
News October 30, 2025
ADB: కేయూ ఫీజు గడువు పెంపు

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు గడువును మరొకసారి పొడగిస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 29 వరకు అపరాధ రుసుముతో ఫీజు చెల్లించడానికి గడువు ముగిసింది. అదే అపరాధ రుసుముతో NOV 03 వరకు పొడగించినట్లు వెల్లడించారు. నవంబర్ నెలలో పరీక్షలు ఉంటాయని వివరించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి సకాలంలో ఫీజు చెల్లించాలని సూచించారు.


