News March 12, 2025

గ్రూప్‌2 ఫలితాల్లో.. ADB వాసికి STATE 5TH ర్యాంక్

image

గ్రూప్‌2 ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువకులు సత్తా చాటారు. ఇందులో భాగంగా తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన చింతలపల్లి వెంకట్ రెడ్డి కుమారుడు చింతలపల్లి ప్రీతంరెడ్డి గ్రూప్‌2 ఫలితాల్లో 431 మార్కులు సాధించారు. కాగా రాష్ట్రస్థాయిలో ఐదో ర్యాంకు స్థానంలో నిలిచారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందించారు.

Similar News

News March 24, 2025

ADB: కిషన్ రెడ్డిని కలిసిన MRPS జిల్లా అధ్యక్షుడు

image

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‌లో MRPS జిల్లా అధ్యక్షుడు ఆరెల్లి మల్లేశ్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ నేతృత్వంలో జరుగుతున్న దండోరా ఉద్యమానికి మొదటి నుంచి అండగా ఉండి కేంద్ర పెద్దలను కిషన్ రెడ్డి ఒప్పించారని మల్లేశ్ అన్నారు. అనంతరం ఆయన్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శాలువతో సత్కరించారు.

News March 24, 2025

రాష్ట్రస్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన ADB అమ్మాయి

image

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఆదిలాబాద్ అమ్మాయి సత్తాచాటింది. HYDలో ఆదివారం నిర్వహించిన పోటీల్లో ఆదిలాబాద్‌కు చెందిన క్రీడాకారిణి జాదవ్ కుషవర్తి అండర్ 20 విభాగంలో జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించింది. ఈ సందర్భంగా జాదవ్ కుషవర్తితోపాటు కోచ్ సౌమ్య, మేనేజర్ అనిల్‌ను జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజేష్‌, పలువురు అభినందించారు

News March 24, 2025

ADB: ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవం

image

కళాకారులకు మంచి అవకాశాలున్నాయని వాటిని సద్వినియోగం చేసుకొని తామను తాము నిరూపించుకోవాలని ప్రముఖ నిర్మాత డాక్టర్ రవి కిరణ్ యాదవ్ అన్నారు. ఆదివారం జడ్పీ సమావేశ మందిరంలో ఆదిలాబాద్ ఫిల్మ్ సొసైటి ఆధ్వర్యంలో తెలంగాణ భాష సంస్కృతిక శాఖ సౌజన్యంతో అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఇందులో సీనియర్ జర్నలిస్టులను మీడియా ఎక్సలెన్సీ అవార్డు, షార్టు ఫిలిం తీసిన వారికి ప్రశంసాపత్రాలు అందించి శాలువాతో సత్కరించారు.

error: Content is protected !!