News September 2, 2024
గ్రేటర్‌లో నిధులు నిల్.. కదలని అభివృద్ధి పనులు
గ్రేటర్‌లో అత్యవసర పనులు తప్ప కొద్ది నెలలుగా ఇతర అభివృద్ధి జరగట్లేదు. కాలనీ రోడ్లు, నాలాలు, పార్కులు, శ్మశానవాటికల అభివృద్ధి, మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణం ఇలా చాలా పనులు ఆటకెక్కాయి. కొన్ని మధ్యలోనే నిలిచిపోయాయి. నాలాల పూడికతీత, నిర్మాణ పనులు సవ్యంగా జరగకపోవడంతో వర్షాకాలం ముంపు తిప్పలు తప్పడం లేదు. జీహెచ్ఎంసీకి సర్కారు నుంచి వేర్వేరు రూపాల్లో రూ.8వేల కోట్లు రావాలి.
Similar News
News February 2, 2025
HYD: అప్డేట్ అయిన సిటీ డే పాస్
HYD సిటీ ఆర్టీసీ బస్సులలో ట్రావెల్ 24 అవర్స్ టికెట్ అప్డేట్ అయింది. QR కోడ్, ఫోన్ నంబర్‌తో పాటు టికెట్ ప్రింట్ వస్తుంది. ఇంతకుముందు QR కోడ్ లేకపోవడంతో కొంతమంది ప్రయాణికులు చెల్లని డే పాస్‌లతో ప్రయాణం చేస్తున్నా.. కొన్నిసార్లు కండక్టర్‌లు గుర్తించడం కష్టంగా ఉండేది. ఫోన్ నంబర్, QR కోడ్ ఉండడంతో నకిలీ టికెట్లు గుర్తించడం తేలిక అని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
News February 2, 2025
రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న చలి తీవ్రత
రంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. చుక్కాపూర్‌లో 11.9℃, చందనవల్లి, రెడ్డిపల్లె 12, ఎలిమినేడు 12.9, రాచలూరు, మీర్‌ఖాన్‌పేట 13, మంగళపల్లె 13.2, వైట్‌గోల్డ్ SS 13.3, రాజేంద్రనగర్ 13.4, దండుమైలారం, విమానాశ్రయం, అమీర్‌పేట, మద్గుల్ 13.5, తొమ్మిదిరేకుల 13.7, సంగం, కాసులాబాద్, హైదరాబాద్ యూనివర్సిటీ, వెల్జాల 13.8, కేతిరెడ్డిపల్లి 14, తాళ్లపల్లి 14.1, కొత్తూరులో 14.3℃ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
News February 2, 2025
HYD: నేడు కాంగ్రెస్ నిరసనలు
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్షకు నిరసనగా నేడు ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నాను నిర్వహించనుంది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. బడ్జెట్లో తెలంగాణ పట్ల చూపిన వివక్షను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాల్సిందిగా పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.