News September 2, 2024

గ్రేటర్‌లో నిధులు నిల్.. కదలని అభివృద్ధి పనులు

image

గ్రేటర్‌లో అత్యవసర పనులు తప్ప కొద్ది నెలలుగా ఇతర అభివృద్ధి జరగట్లేదు. కాలనీ రోడ్లు, నాలాలు, పార్కులు, శ్మశానవాటికల అభివృద్ధి, మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణం ఇలా చాలా పనులు ఆటకెక్కాయి. కొన్ని మధ్యలోనే నిలిచిపోయాయి. నాలాల పూడికతీత, నిర్మాణ పనులు సవ్యంగా జరగకపోవడంతో వర్షాకాలం ముంపు తిప్పలు తప్పడం లేదు. జీహెచ్ఎంసీకి సర్కారు నుంచి వేర్వేరు రూపాల్లో రూ.8వేల కోట్లు రావాలి.

Similar News

News October 18, 2025

HYD: ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద BRS నేతల నిరసన

image

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ హామీ అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేస్తామని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో జరిగిన బీసీ బంద్ ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల ఆత్మగౌరవం కోసం పోరాటం కొనసాగుతుందని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

News October 18, 2025

HYD: ఆటోవాలాకు ‘దీపావళి పండుగ’

image

బీసీల 42% రిజర్వేషన్‌ బిల్లుపై హైకోర్టు స్టే విధించడంతో అన్ని పార్టీలు ఏకకంఠంగా తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో ఆర్టీసీ చక్రాలు ఆగిపోయాయి. బస్టాప్‌లు ఆటోలతో కిక్కిరిశాయి. పాఠశాలలు మూతపడి, ఉద్యోగాలు కొనసాగడంతో ఆటోల డిమాండ్‌ ఆకాశాన్నంటింది. ప్రయాణికులు డబుల్‌ ఛార్జీకి ఒప్పుకోవాల్సి వచ్చింది. అకస్మాత్తుగా పడిన ఈ అదృష్టంతో ఆటోవాలకు ముందుగానే ‘దీపావళి’ వెలుగొచ్చిందని సంబరపడుతున్నారు.

News October 18, 2025

HYD: బాలికపై అత్యాచారం.. ట్యూషన్ టీచర్‌కు పదేళ్ల జైలు శిక్ష

image

విద్యార్థినిపై అత్యాచార ఘటనలో ట్యూషన్ టీచర్‌కు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ HYD రాజేంద్రనగర్ ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి ఆంజనేయులు తీర్పునిచ్చారు. బాలిక(12) నివసించే ప్రాంతంలో సుబ్రహ్మణ్యేశ్వరరావు దగ్గర రోజు ట్యూషన్‌కి వెళ్లేది. 2017 డిసెంబర్ 3న బాలికపై ట్యూషన్ అయిపోయాక గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు పూర్తి ఆధారాలు సమర్పించడంతో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధించారు.