News September 2, 2024
గ్రేటర్‌లో నిధులు నిల్.. కదలని అభివృద్ధి పనులు
గ్రేటర్‌లో అత్యవసర పనులు తప్ప కొద్ది నెలలుగా ఇతర అభివృద్ధి జరగట్లేదు. కాలనీ రోడ్లు, నాలాలు, పార్కులు, శ్మశానవాటికల అభివృద్ధి, మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణం ఇలా చాలా పనులు ఆటకెక్కాయి. కొన్ని మధ్యలోనే నిలిచిపోయాయి. నాలాల పూడికతీత, నిర్మాణ పనులు సవ్యంగా జరగకపోవడంతో వర్షాకాలం ముంపు తిప్పలు తప్పడం లేదు. జీహెచ్ఎంసీకి సర్కారు నుంచి వేర్వేరు రూపాల్లో రూ.8వేల కోట్లు రావాలి.
Similar News
News September 10, 2024
HYD: వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏర్పాటుకు 3 ప్రాంతాల పరిశీలన
HYD శివారులో రానున్న ప్యూచర్ సిటీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రారంభించేందుకు రంగారెడ్డి జిల్లా అధికారులు ప్లాన్‌లు రూపొందిస్తున్నారు. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ తరహాలో మన HYDలోనూ సెంటర్ ఏర్పాటు చేయాలని వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆసక్తి చూపినట్లు వారు తెలిపారు. ఇందుకు 3ప్రాంతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ మేరకు 70 ఎకరాల స్థలం అవసరమని భావిస్తున్నారు.
News September 10, 2024
HYD: గండిపేట చెరువులో భారీ చేప (PHOTO)
ఇటీవల కురుస్తోన్న భారీ వర్షాలు, వరదలకు గండిపేట చెరువు నిండుకుండలా మారింది. దీంతో జాలరులు చేపల వేట కొనసాగిస్తున్నారు. సోమవారం మొయినాబాద్ మండలం హిమాయత్‌నగర్‌కి చెందిన కొంతమంది చేపల వేటలో పడ్డారు. దాదాపు 12 కిలోలకు పైగా చేప వలకు చిక్కింది. ఇది తెలుసుకున్న యువత గాళాలు వేసి చేపలు పట్టేందుకు ఆసక్తి చూపించారు.
News September 10, 2024
HYD: మరణంలోనూ వీడని స్నేహం
HYD శివారు షాద్‌నగర్ సమీపంలోని ఎలికట్ట శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. కొందర్గు మండలానికి చెందిన కరుణాకర్, శేఖర్ ప్రాణ స్నేహితులు. వీరు ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లేవారు. ఆదివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు షాద్‌నగర్‌లో కలుసుకున్నారు. మద్యం సేవించి బైక్‌పై ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు.