News September 9, 2024
గ్రేటర్ వరంగల్‌లో అపురూపమైన కట్టడం!
గ్రేటర్ వరంగల్‌లో అపురూపమైన కట్టడంగా కాళోజీ కళాక్షేత్రం నిలవనుంది. కాళోజీ నారాయణరావు స్మారకార్థం హనుమకొండ హయగ్రీవాచారి మైదానంలో నిర్మిస్తున్న కళాక్షేత్రం ఓరుగల్లుకు తలమానికం కానుంది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతికి దీటుగా దీనిని నిర్మించారు. సువిశాలమైన పరిసరాలు, ఆహ్లాదకరమైన ఉద్యానవనం, ప్రకృతి వాతావరణంలో ఈ కళాక్షేత్రం అందుబాటులోకి రానుంది.
Similar News
News October 6, 2024
దక్షిణాఫ్రికాలో మెరిసిన మహబూబాబాద్ అమ్మాయి
దక్షిణాఫ్రికాలో జరిగిన అంతర్జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్‌లో ఇండియా తరఫున 76 కేజీల విభాగంలో మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలానికి చెందిన సుకన్య రజతం సాధించింది. జాతీయ స్థాయిలో పతకం గెలవడంతో జిల్లాలో ప్రజలు అనందం వ్యక్తం చేస్తున్నారు. తన సొంత గ్రామంలో సంబురాలు అంబారాన్నంటాయి. అంతర్జాతీయ స్థాయిలో రాణించడం గర్వకారణమని తెలుగునాట ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
News October 6, 2024
MLG: ఆత్మ రక్షణ కోసం కరాటే నేర్చుకోవాల
విద్యార్థులు, యువత ఆత్మ రక్షణ కోసం కరాటే నేర్చుకోవాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు దనసరి సూర్య అన్నారు. తాడ్వాయి మండలంలోని మేడారంలో నిర్వహించిన కరాటే శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తాడ్వాయి అధ్యక్షుడు బొల్లు దేవేందర్ గౌడ్ పాల్గొన్నారు.
News October 6, 2024
వరంగల్ మార్కెట్ రేపు పున:ప్రారంభం
2 రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున:ప్రారంభం కానుంది. నిన్న, ఈరోజు వారాంతపు సెలవులు నేపథ్యంలో మార్కెట్ బంద్ అయింది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.