News February 27, 2026
గ్రేటర్ వరంగల్‌లో తగ్గిన ఆదాయం!

గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు పెరగడం వల్ల కార్పొరేషన్‌కు వివిధ ఫీజుల రూపంలో వచ్చే భవన నిర్మాణాల అనుమతుల ఆదాయం తగ్గుతోంది. 2024-25లో రూ.52 కోట్ల ఆదాయం వచ్చింది. 2025-26 బడ్జెట్లో భవన నిర్మాణ అనుమతుల ద్వారా రూ.136.05 కోట్లు ఆదాయం పొందాలని అంచనా వేయగా, ఇప్పటి వరకు రూ.22 కోట్లు మాత్రమే వచ్చింది. ఆదాయం తగ్గడానికి అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించడమే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి
Similar News
News April 12, 2026
హుజూర్‌నగర్ విద్యార్థినికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్

హుజూర్‌నగర్‌కు చెందిన బోరెడ్డి వర్షిత ఇంటర్ మొదటి సంవత్సరంలో 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. వర్షిత అసాధారణ ప్రతిభపై తల్లిదండ్రులు, పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షితను పలువురు ప్రముఖులు అభినందిస్తూ.. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
News April 12, 2026
మెదక్: ఇంటర్ విద్యార్థి సూసైడ్

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మంగళపర్తిలో విషాదం నెలకొంది. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్థాపం చెందిన చాకలి సాయిరాం అనే విద్యార్థి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
News April 12, 2026
NZB: ఇంటర్ రిజల్ట్స్‌లో బాలికలదే ఆధిపత్యం

ఇంటర్ పరీక్షా ఫలితాల్లో నిజామాబాద్ జిల్లాల్లో బాలికలే పైచేయి సాధించారు. ప్రథమ, ద్వితీయ, ఒకేషనల్ కోర్సుల్లోనూ గర్ల్స్ ఆధిపత్యం చాటారు. జిల్లాలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు మొత్తం 13,876 మంది రాయగా, అందులో బాలికలు 7,606కు గాను 5,828 (76.56శాతం) మంది పాస్ అయ్యారు. ఓకేషనల్ కు సంబంధించి 1,002 మంది బాలికలు పరీక్షలు రాయగ 843 (84.13 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు.


