News November 24, 2024
గ్రేటర్ హైదరాబాద్‌లో హాస్టళ్లపై ఆకస్మిక తనిఖీలు

హుమయూన్‌నగర్‌లోని తెలంగాణ మైనార్టీ పాఠశాల బాలుర -1ను ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్లోని వంటగది, భోజనశాల, స్టోర్‌రూమ్, పడకగదులు, ప్రొవిజన్స్, హాస్టల్ రిజస్టర్లను పరిశీలించారు. పిల్లలతో కలసి ఆయన టిఫిన్ చేశారు. టిఫిన్స్ ఎలా ఉన్నాయని విద్యార్థులతో అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ నిర్వహణ బాగుందని ఆయన ప్రశంసించారు.
Similar News
News October 31, 2025
HYD: ఉక్కుమనిషి ‘సర్దార్’ ఎలా అయ్యారో తెలుసా?

1928లో గుజరాత్‌లోని బర్దోలి తాలూకాలో బ్రిటిష్ ప్రభుత్వం భూమిశిస్తు 30% పెంచగా రైతులు ఆగ్రహించారు. ఎన్నో విన్నపాలు చేసినా ప్రభుత్వం స్పందించలేదు. పటేల్ స్ఫూర్తితో వారంతా సత్యాగ్రహానికి దిగారు. 137 గ్రామాల రైతులు ఐక్యంగా పోరాడారు. ఒత్తిడికి తలొగ్గిన బ్రిటిష్ ప్రభుత్వం శిస్తు తగ్గించక తప్పలేదు. రైతుల ఐక్యతకు శిఖరంగా నిలిచిన ఈ పోరాటం పటేల్‌ను ‘సర్దార్’ చేసింది. ఆయన చొరవతోనే HYD భారత్‌లో విలీనం అయింది.
News October 31, 2025
HYD: అజహరుద్దీన్ ప్రస్థానం ఇదే!

రాజ్ భవన్లో మంత్రిగా అజహరుద్దీన్ ప్రమాణస్వీకారం చేశారు. భారత్ క్రికెట్ జట్టు సారథిగా వ్యవహరించిన అజహరుద్దీన్ 1963 ఫిబ్రవరి 8న HYDలో జన్మించారు. అబిడ్స్‌లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్లో పాఠశాల విద్య, నిజాం కాలేజీలో బీకాం అభ్యసించారు. 2009లో అజహరుద్దీన్ కాంగ్రెస్‌లో చేరి, యూపీలోని మొరాదాబాద్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు.
News October 31, 2025
HYD: ‘3 నెలల క్రితమే మంత్రి పదవిపై నిర్ణయం’

కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ దేశానికి చేసిన సేవలను గుర్తుచేశారు. అజార్‌పై ఉన్న కేసుల గురించి స్పష్టంగా చెప్పాలంటే కిషన్‌రెడ్డి ముందుకు రావాలని సవాల్ విసిరారు. 3 నెలల క్రితమే ఆయనకు మంత్రి పదవిపై నిర్ణయం తీసుకున్నామని, దీంతో మైనారిటీలకు మేలు జరుగుతుందని ఆయన తెలిపారు.


