News July 26, 2024
గ్రేటర్ HYDలో అదనంగా మరో 100 ఛార్జింగ్ స్టేషన్లు..!
గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పుడున్న ఛార్జింగ్ స్టేషన్లకు అదనంగా మరో 100 స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వాహనాల ఛార్జింగ్ స్టేషన్ వివరాలు, వాటి వినియోగం కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. సంప్రదాయేతర, కాలుష్య రహిత విద్యుదుత్పత్తికి ప్రాధాన్యమిస్తూ నూతన విద్యుత్ విధానాన్ని తీసుకురానున్నట్లు బడ్జెట్‌లో ప్రభుత్వం వెల్లడించింది.
Similar News
News October 12, 2024
HYD: ఉప్పల్ వెళ్తున్నారా.. వీటికి నో ఎంట్రీ!
HYD ఉప్పల్ స్టేడియంలో మరికాసేపట్లో T20 క్రికెట్ మ్యాచ్ జరగనుంది. స్టేడియంలోకి కెమెరా, రికార్డింగ్ పరికరాలకు అనుమతి లేదు. హెడ్ ఫోన్స్, ఇయర్ ప్యాడ్స్, సిగరెట్, అగ్గిపెట్టె, కత్తి, తుపాకీ, కూల్ డ్రింక్స్, పెంపుడు జంతువులు, తినుబండారాలు, బ్యాగులు, ల్యాప్ టాప్, సెల్ఫీ స్టిక్, హెల్మెట్ టపాకాయలు, డ్రగ్స్, సిరంజి, వైద్య పరికరాలు నిషేధమని ఉప్పల్ ట్రాఫిక్ సీఐ లక్ష్మీ మాధవి తెలిపారు.
SHARE IT
News October 12, 2024
హైదరాబాద్‌లో వైన్స్ షాపులకు పోటెత్తారు..!
దసరా నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లోని వైన్స్ షాపులకు మందుబాబులు పోటెత్తారు. ఏ వైన్స్ ముందు చూసినా రద్దీగా కనపడుతోంది. పండుగకు సొంతూరికి వచ్చిన వారితో పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి. హైదరాబాద్‌లోని పలు చోట్ల షాపులు తెరవకముందే క్యూ కట్టిన దృష్యాలు కనిపించాయి.
NOTE: మద్యం తాగి వాహనాలు నడపకండి.
News October 12, 2024
హైదరాబాదీలకు దసరా స్పెషల్ ఏంటి?
దసరా వేడుకలు తెలంగాణ వారందరికీ స్పెషల్.. ఇక్కడి వారికి అమ్మమ్మ ఇల్లు యాదికొస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో HYDలో ఉద్యోగాలు చేస్తూ తిరిగి సొంతూరుకు వెళ్లడం, బంధువులు, దోస్తులతో ఊరంతా తిరగడం బాగుంటుంది. ‘ఎప్పుడొచ్చినవ్.. అంతా మంచిదేనా’ అంటూ తెలిసినవారి పలకరింపు ఆనందాన్ని కలిగిస్తుంది. ఉరెళ్తామని ఎన్నో రకాల పిండివంటలు సిద్ధం చేస్తారు. మరి మీ ఊరిలో దసరా వేడుకలకు ఏం చేస్తారో కామెంట్ చేయండి.