News June 2, 2024
గ్రేటర్ HYDలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు

గ్రేటర్ HYDలోని ప్రతి బస్ డిపోలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ పనులను ప్రారంభించింది. కంటోన్మెంట్, మియాపూర్-1 డిపోలో ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జింగ్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా, గ్రేటర్‌లోని మరో 23 బస్ డిపోల్లోనూ జులై చివరి నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఇప్పటికే 62 ఎలక్ట్రిక్ బస్సులు ఉండగా మరో 20 జూన్ చివరి నాటికి అందుబాటులో రానున్నాయి.
Similar News
News November 21, 2025
రామానాయుడు, అన్నపూర్ణ స్టూడియోస్‌కు నోటీసులు

GHMC ఖజానాకు గండికొడుతున్న సినిమా స్టూడియోలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. బంజారాహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియో విస్తీర్ణానికి ₹11.52 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉండగా యాజమాన్యం ₹49 వేలు చెల్లింస్తోందని గుర్తించారు. జూబ్లీహిల్స్‌లోని రామనాయుడు స్టూడియో విస్తీర్ణం తక్కువ చూపుతూ ₹1.92 లక్షలు చెల్లించాల్సి ఉండగా ₹1,900 చెల్లిస్తుండడంతో GHMC సర్కిల్ 18 అధికారులు నోటీసులు జారీ చేశారు.
News November 21, 2025
హైదరాబాద్‌లో గజ.. గజ.. గజ..

HYDలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. 10ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా చలి రికార్డు సృష్టిస్తోంది. నిన్న పటాన్చెరులో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 6.4 తక్కువగా నమోదయ్యాయి. రాజేంద్రనగర్‌లో 11.5, హయత్‌నగర్‌లో 12.6, అటు కూకట్పల్లి, ఇటు పాతబస్తీ పరిసరాల్లో 13°Cకు పడిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. సగటున గరిష్ఠ ఉష్ణోగ్రత 29.4, కనిష్ఠ ఉష్ణోగ్రత 13.1 డిగ్రీలుగా నమోదైంది. పలుచోట్ల ఉ.8వరకు మంచు కురుస్తోంది.
News November 21, 2025
HYD: దొంగ నల్లా కనెక్షన్‌పై ఫిర్యాదు చేయండి

గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా నల్లా అక్రమ కనెక్షన్లపై అధికారుల రైడ్ కొనసాగుతుంది. అనేక ప్రాంతాల్లో దాదాపుగా 50 మందికిపైగా వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరైనా అక్రమ కనెక్షన్లు గుర్తించినా, డొమెస్టిక్ కనెక్షన్ తీసుకున్న వారు, కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తే 99899 98100 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.


