News July 23, 2024
గ్రేటర్ HYDలో కాలుష్య భూతం..!

గ్రేటర్ HYDలో కాలుష్య భూతం మెల్లమెల్లగా పెరుగుతోన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం.. PM 2.5 వ్యాసం కలిగిన సూక్ష్మ ధూళికణాలకు సంబంధించి గత 4 నెలల రికార్డులను పరిశీలిస్తే జూపార్కు ప్రాంతంలో 115, పాశమైలారం 104, బాలానగర్ 101, ఉప్పల్ 89, జీడిమెట్ల 107, ప్యారడైజ్ 96 మైక్రాన్లుగా నమోదైంది. సాధారణంగా 40 మైక్రాన్ల లిమిట్ దాటితే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
Similar News
News November 1, 2025
జూబ్లీహిల్స్ బైపోల్స్.. ఇప్పటి వరకు 15 కేసులు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నిబంధనలను అధికారులు కచ్చితంగా అమలు చేస్తున్నారు. రూల్స్ అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు 15 మందిపై కేసులు నమోదు చేశారు. కాంగ్రెస్, BRS, BJP నాయకులు తమ ప్రత్యర్థి పార్టీ నాయకులు, కార్యకర్తలపై నిఘా వేసి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తున్నారు. ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలని పోలీసులు పేర్కొన్నారు.
News November 1, 2025
HYD: సన్న బియ్యం సిద్ధం.. రేషన్ షాపులకు వెళ్లండి..!

నగర వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు 653 రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. 17,102 టన్నుల సన్న బియ్యం నవంబరులో పంపిణీ చేయనున్నట్లు జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు. 30,42,056 మంది లబ్ధిపొందుతారని వివరించారు. 8,500 టన్నుల బియ్యం రేషన్ షాపుల్లో మొదటి విడతగా సిద్ధంగా ఉన్నాయన్నారు.
News November 1, 2025
HYD: చంద్రబాబు ఫొటోతో ప్రచారం.. కాంగ్రెస్ VS BJP

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో చంద్రబాబు ఫొటోలు, TDP జెండాలు దర్శనమిస్తున్నాయి. ఇటీవల BJP ర్యాలీలో TDP జెండాలు కనిపించగా తాజాగా కాంగ్రెస్ ర్యాలీలో చంద్రబాబు ఫొటో కనిపించింది. అయితే కాంగ్రెస్ నేతలపై సరూర్నగర్ BJP కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ NDA మిత్రపక్ష నేత, AP CM చంద్రబాబు ఫొటోను కాంగ్రెసోళ్లు వినియోగించడం సిగ్గు చేటన్నారు.ఓటర్లను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.


