News February 17, 2025

గ్రేటర్ HYDలో తగ్గిన భూగర్భ జలాలు

image

గ్రేటర్ పరిధిలో భూగర్భ జల శాఖ విశ్లేషణలో HYD ఔటర్ రింగ్ రోడ్డు వరకు 53 ప్రదేశాల్లో భూగర్భ జలాల వివరాలు వెల్లడయ్యాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది జనవరిలో భూగర్భ జలాలు 1.33 మీటర్లు తక్కువగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. 33 ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గగా, 20 ప్రాంతాల్లో మెరుగ్గా ఉన్నట్లు పేర్కొన్నారు. జనవరి చివరి నాటికి సరాసరిగా 9.4 మీటర్ల భూగర్భ జలాలు ఉన్నాయి.

Similar News

News April 10, 2026

రూ.200 కోట్లతో మరో సైబర్ టవర్

image

ఐటీ హంగులకు ప్రతీకగా త్వరలో మరో అత్యాధునిక సైబర్ టవర్ నిర్మాణం కానుంది. కొత్తగా ఏర్పాటైన సైబరాబాద్ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం కోసం కైత్లాపూర్‌లోని 5ఎకరాల స్థలంలో G+8 అంతస్తుల సమీకృత భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.200కోట్ల అంచనాతో నిర్మించనున్నారు. 3జోన్లు, 16సర్కిళ్ల పరిధిలోని ప్రజలకు అన్ని ప్రభుత్వ సేవలు ఒకే చోట అందించడమే లక్ష్యంగా ఈ భారీ భవన నమూనాను సిద్ధం చేస్తున్నారు.

News April 10, 2026

HYD: DGP ఎదుట లొంగిపోనున్న 30మంది మావోయిస్టులు

image

హైదరాబాద్‌లో ఈరోజు భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగుపోతుండటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మ.3 గంటలకు డీజీపీ శివధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. మొత్తం 30 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోనుండగా, ఇందులో PLGA బెటాలియన్ సభ్యులు ఉన్నట్లు సమాచారం. లొంగుబాటుతో నక్సలిజం నిర్మూలనలో పోలీసులు మరో ముందడుగు వేశారు.

News April 10, 2026

HYD: రాజకీయ నేత కుమారుడి లైంగిక వేధింపులు.. బాలిక ఆత్మహత్య

image

హయత్‌నగర్‌లో దారుణం జరిగింది. ఓ రాజకీయనేత కుమారుడి లైంగిక వేధింపులకు మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. విషయాన్ని బయటకు చెబితే కుటుంబాన్ని అంతం చేస్తామని బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. కూతురు మృతదేహాన్ని తీసుకొని సొంత గ్రామానికి బాధితులు వెళ్లిపోయారు. బాలిక మృతికి కారకులపై పోక్సో కేసు నమోదు చేయాలంటూ ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బాధితురాలి తండ్రి PSలో ఫిర్యాదు చేయడానికి వస్తున్నట్లు సమాచారం.