News February 22, 2025
గ్రేటర్ HYDలో 80% స్టెరిలైజేషన్ పూర్తి.!

జీహెచ్ఎంసీ వ్యాప్తంగా వీధి కుక్కల నియంత్రణ, సంక్షేమం కోసం అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఇటీవల జీహెచ్ఎంసీ హైకోర్టుకు నివేదించింది. 80% స్టెరిలైజేషన్ పూర్తి చేయడంతో పాటు, విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొంది. జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడికక్కడ కుక్కల నియంత్రణ చేపడుతున్నట్లు తెలిపింది.
Similar News
News March 19, 2025
అన్నమయ్య: పుట్టిన రోజే మృతి

పుట్టిన రోజు సరదాగా స్నేహితుడితో వెళ్లిన వారికి అదే చివరి రోజు అయింది. ఈ విషాద ఘటన అన్నమయ్య జిల్లా పీటీఎం మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అంబేడ్కర్ కాలనీకి చెందిన శ్రీనివాసులు(22)ది సోమవారం పుట్టినరోజు. తన స్నేహితుడు చందు(22)తో బి.కొత్తకోటలో సినిమా చూడటానికి వెళ్లారు. ఇంటికి వస్తున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
News March 19, 2025
సూర్యాపేట: ప్రజలు వెయిటింగ్.. బడ్జెట్ ఓకేనా!

అసెంబ్లీలో ప్రభుత్వం నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా దానిపై జిల్లా ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. సూర్యాపేటలో ఆటోనగర్‌లో IT కారిడార్ ఏర్పాటు, SRSP కాల్వలకు నిధులు, MG యూనివర్సిటీకి ఫండ్స్, తుంగతుర్తిలో డిగ్రీ కళాశాల, ఐటీఐ కళాశాలను ఏర్పాటు కోసం ఇక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి కీలక శాఖలకు ఇద్దరు మంత్రులుగా ఉండడంతో బడ్జెట్ ఆశాజనకంగా ఉంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
News March 19, 2025
భద్రాద్రి: మైనర్‌పై అత్యాచారం..యువకుడిపై పోక్సో కేసు

భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలంలోని ఓ గ్రామంలో 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో యువకుడి(24)పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు సోమవారం రాత్రి ఊరు చివరికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడగా, విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారి ఫిర్యాదు మేరకు, యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వివరించారు.