News September 23, 2024
గ్రేటర్ HYDలో RTC బస్‌పాస్ REPORT
2024 ఆగస్టులో ప్రవేశపెట్టిన మెట్రో డీలక్స్ మంత్లీ బస్‌పాస్ కొద్ది రోజుల్లోనే 750 మంది కొనుగోలు చేశారని అధికారులు తెలిపారు. రూ.1450 విలువైన ఈ పాస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఈ-మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లోనూ చెల్లుబాటు అవుతోంది. ప్రస్తుతం నగరంలో 10,000 మంది ఆర్డినరీ, 75,000 మంది మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్ వినియోగిస్తున్నట్లుగా వెల్లడించారు.
Similar News
News October 9, 2024
HYD: దసరా.. ఊరెళ్లేవారికి ఛార్జీల మోత!
బతుకమ్మ నేపథ్యంలో TGRTC ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్పెషల్ బస్సుల్లో ఛార్జీలు పెంచారని ప్రయాణికులు వాపోతున్నారు. సాధారణ ఛార్జీల కంటే స్పెషల్ బస్సుల్లో దాదాపు 25 శాతం అధికంగా ఉన్నట్లు ఓ ప్రయాణికుడు తెలిపారు. పండుగ వేళ తమ జేబులకు చిల్లు పడుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ఉప్పల్ అధికారులను వివరణ కోరగా.. కేవలం స్పెషల్ బస్సులకే మాత్రమే ఈ ధరలు వర్తిస్తాయన్నారు.
News October 9, 2024
బతుకమ్మ: రేపు దద్దరిల్లనున్న హైదరాబాద్!
సద్దుల బతుకమ్మ వేడుకలకు రాజధాని ముస్తాబైంది. ఎల్బీస్టేడియం, ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్ అంతటా రేపు రాత్రి సందడే సందడి. వేలాది మంది ఆడపడుచులు అందంగా బతుకమ్మలను పేర్చి, గౌరమ్మను చేసి ట్యాంక్‌బండ్‌కు తీసుకొస్తారు. హుస్సేన్‌సాగర్‌తో పాటు బాగ్‌లింగంపల్లి, KPHB, సరూర్‌నగర్, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్‌లోని GHMC మైదానాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు బతుకమ్మ పాటలతో హైదరాబాద్ హోరెత్తనుంది.
News October 8, 2024
HYD: ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ చేయాలి: కూనంనేని
తెలంగాణలో విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులు సుమారు 19వేల మంది చాలీచాలని జీతాలతో వెట్టిచాకిరి చేస్తూ కాలం వెల్లదీస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ సందర్భంగా నారాయణగూడలో ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ రంగ ఆర్టిజన్ కార్మికులనూ రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.