News July 27, 2024
గ్రేటర్ HYD పరిధిలో మ్యాన్ హోల్ లెక్కలు

గ్రేటర్ లోతైన మ్యాన్ హోల్స్ 63 వేలకు పైచిలుకు ఉన్నట్లు అధికారిక యంత్రాంగం వెల్లడించింది.HYD పరిధిలో మొత్తం సీవరేజ్ లైన్ వ్యవస్థ 5,767 కిలోమీటర్ల మేర ఉంది. నగర శివారు మున్సిపాలిటీల్లో సుమారుగా 4,200 కిలోమీటర్ల వ్యవస్థ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా మొత్తంగా 6,34,919 మాన్ హోల్స్ ఉన్నాయి.
Similar News
News January 4, 2026
ఉమ్మడి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక

చేవెళ్లలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బాలుర బాల్ బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక పోటీలు ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షుడు చెన్నయ్యగౌడ్ మాట్లాడుతూ.. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను 2 జట్లుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ నెల 10, 11న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జరిగే రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో పాల్గొంటారని వెల్లడించారు. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో రాణించాలన్నారు.
News January 2, 2026
HYD: AI కోర్సులకు ఫ్రీగా ఆన్లైన్ శిక్షణ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ML, డేటా సైన్స్ తదితర సాఫ్ట్వేర్ కోర్సులకు ఆన్లైన్ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు నేషనల్ స్కిల్ అకాడమీ డైరెక్టర్ వెంకటరెడ్డి తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వ ఆమోదిత సర్టిఫికెట్ ప్రదానం చేస్తామని తెలిపారు. అసక్తిగల అభ్యర్థులు జనవరి 15లోగా nationalskillacademy.inలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
News January 1, 2026
RR : రోడ్డు భద్రత మాసోత్సవాలను ప్రారంభించిన కలెక్టర్

జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే రోడ్డు భద్రత మాస వేడుకలకు సంబంధించిన బ్రోచర్లను కలెక్టర్ సి.నారాయణ రెడ్డి విడుదల చేశారు. ఈ నెల మొత్తం జిల్లాలో రోడ్డు భద్రతా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రవాణా శాఖ RTA – DTC, MVIలు, AMVIలు, EE R&B బృందంతో పాటు, మహేశ్వరం DCP, ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ బృందం CI తదితరులు పాల్గొంటారని తెలిపారు.


