News February 17, 2025
గ్రేటర్ HYD పార్కుల్లో CCTV కెమెరాలు

గ్రేటర్ HYD పార్కుల్లో అసాంఘిక కార్యక్రమాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని పట్టణ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీకటి పడితే అసలు అడ్డూ అదుపు లేకుండా పోతుందంటున్నారు. కాగా వీటికి అడ్డుకట్ట వేసేందుకు తొలివిడతగా 7 పార్కులను ఎంపిక చేసి, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని HMDA టెండర్లను ఆహ్వానించింది. కాంట్రాక్టర్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిర్వహణ బాధ్యతను రెండేళ్ల పాటు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News October 25, 2025
జర్నలిస్టులకు స్థలాలిచ్చి ఇళ్లు నిర్మిస్తాం: మంత్రి పార్థసారథి

AP: పేదలందరికీ ఇళ్లు, స్థలాలివ్వాలని నిర్ణయించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. అర్హులైన వారందరికీ 2, 3 సెంట్లు స్థలాలు ఎలా ఇవ్వాలో GOM భేటీలో చర్చించామన్నారు. జర్నలిస్టులకు స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇవ్వాలనేది తమ ప్రభుత్వ విధానమని తెలిపారు. అయితే SC తీర్పు ఉన్న నేపథ్యంలో లీగల్గా ఉన్న అడ్డంకులను అధిగమించేందుకు అడ్వకేట్ జనరల్ అభిప్రాయం అడుగుతామని మంత్రి వివరించారు.
News October 25, 2025
నుడా వైస్ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన జేసీ

నుడా వైస్ ఛైర్మన్గా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆయనకు అభినందనలు తెలిపారు. బొకే అందజేసి శాలువతో సత్కరించారు. నుడా సంస్థ అభివృద్ధి దిశగా పయనించేందుకు సహాయ సహకారాలు అందించాలని కోటంరెడ్డి కోరారు. అనంతరం నుడా ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై వారు చర్చించుకున్నారు.
News October 25, 2025
ప్రజాసేవల మెరుగుదలే ప్రధాన లక్ష్యం: జిల్లా పంచాయతీ అధికారి

PDPL కలెక్టరేట్లో జిల్లా పంచాయతీ అధికారి అధ్యక్షతన బిల్ కలెక్టర్లు, పంచాయతీ కార్యదర్శులు, మండల పంచాయతీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. టాక్స్ కలెక్షన్, శుభ్రత, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ క్లీనింగ్, డ్రింకింగ్ వాటర్, రికార్డుల నవీకరణ, DSR యాప్ వినియోగం, PMAY(G) అమలు వంటి అంశాలపై చర్చించారు. అధికారుల నిర్లక్ష్యాన్ని సహించమని పంచాయతీ అధికారి హెచ్చరించారు. సమావేశంలో శాఖాధికారులు పాల్గొన్నారు.


