News February 17, 2025

గ్రేటర్ HYD పార్కుల్లో CCTV కెమెరాలు

image

గ్రేటర్ HYD పార్కుల్లో అసాంఘిక కార్యక్రమాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని పట్టణ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీకటి పడితే అసలు అడ్డూ అదుపు లేకుండా పోతుందంటున్నారు. కాగా వీటికి అడ్డుకట్ట వేసేందుకు తొలివిడతగా 7 పార్కులను ఎంపిక చేసి, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని HMDA టెండర్లను ఆహ్వానించింది. కాంట్రాక్టర్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిర్వహణ బాధ్యతను రెండేళ్ల పాటు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 

Similar News

News April 11, 2026

ఆదోని వద్ద ఘోర ప్రమాదం.. యువతి మృతి

image

ఆదోని–సిరుగుప్ప రహదారిలోని లక్ష్మమ్మ వేర్ హౌస్ వద్ద శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. కర్ణాటక నుంచి వస్తున్న కారు అతివేగంతో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక యువతి మరణించగా, మరో ఇద్దరు యువతులు, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్వీ పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 11, 2026

వాట్సాప్‌లోనే రిజిస్ట్రేషన్ సర్వీసులు

image

TG: స్థిరాస్తులు, భూములకు సంబంధించిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సేవలను వాట్సాప్ ద్వారా పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది. 8096958096 నంబర్‌కు Hi అని మెసేజ్ చేయాలి. కావాల్సిన సర్వీసు ఎంచుకొని వివరాలు నమోదు చేసి, ఫాం నింపాలి. ఆ తర్వాత ఆన్‌లైన్ పేమెంట్ చేసి సర్వీసులు పొందవచ్చు. సబ్ రిజిస్ట్రార్ ఆమోదం తర్వాత సర్టిఫైడ్ EC కాపీ నేరుగా వాట్సాప్‌లోనే అందుతుంది.
Share It

News April 11, 2026

GNT: పెట్టుబడుల వెల్లువ.. క్యాబినెట్ నిర్ణయాలతో జిల్లాకు మహర్దశ!

image

రాష్ట్ర క్యాబినెట్ భేటీలో పారిశ్రామికాభివృద్ధి, సాంకేతిక రంగాలకు పెద్దపీట వేస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గుంటూరు జిల్లాలో 200 మెగావాట్ల బయోమాస్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు SAEL సంస్థకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్వాంటమ్ టెక్నాలజీ, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వ్యాలిడేషన్ హబ్ కోసం భారీగా నిధులు కేటాయించడంతో పాటు, QAIG సంస్థకు 2.5 ఎకరాల భూమి, రూ.108 కోట్ల పెట్టుబడికి ఆమోదం తెలిపారు.