News November 19, 2024
గ్రేటర్ HYD రోడ్డు నెట్వర్క్ లెక్క ఇదే..!

గ్రేటర్ HYDలో దాదాపుగా 9,000 KMపైగా రోడ్డు నెట్వర్క్ ఉంది. ఇందులో సుమారు 3,000 కి.మీ బీటీ రోడ్లు, 6,000 కి.మీ పైగా సీసీ రోడ్లు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో CRMP రోడ్లు నిర్మించారు. ప్రస్తుతం 150KM రోడ్డు నెట్వర్క్ నిర్మాణం కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే రోడ్ల నిర్మాణంపై రీబౌండ్ హ్యామర్ టెస్ట్, CSC, తార్ డెన్సిటీ పరీక్షలు కరవయ్యాయని పలు పరిశోధనల్లో తేలింది.
Similar News
News March 9, 2026
HYD స్టేడియాలకు మహర్దశ.. లిస్టులో ఇవే!

నగరంలోని వివిధ ప్రాంతాల స్టేడియాలకు మహర్దశ పట్టనుంది. సరూర్‌నగర్ స్టేడియం, ఎల్బీ స్టేడియం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, లాల్ బహుదూర్ శాస్త్రి స్టేడియాలను ఆధునికరించాలని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆయా సంబంధిత శాఖకు నేడు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ప్రణాళికలు రచించి వేసవిలో పనులు ప్రారంభించి పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
News March 9, 2026
హైదరాబాద్ స్ట్రీట్స్ ఇప్పుడు ఫ్యాషన్ అడ్డా!

HYD యువత ఇప్పుడు ఇంటర్నేషనల్ వైబ్స్‌ను మన లోకల్ స్టైల్‌తో కలిపేస్తోంది. జూబ్లీహిల్స్ నుంచి పాతబస్తీ వరకు గ్లామర్, క్లీన్-గర్ల్ మినిమలిజం ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్. ఓవర్ సైజ్డ్ టీ షర్ట్స్, కార్గోలతో హుషారుగా కనిపిస్తూనే మన దేశీ జ్యువెలరీతో ‘ఫ్యూజన్’ క్రేజ్ పుట్టిస్తున్నారు. చిన్న ఆన్‌లైన్ లేబుల్స్, స్నీకర్ల స్టైలింగ్‌తో మన HYD Gen-Z అదరగొట్టేస్తున్నారు. మరి మీ స్టైల్ ఏంటో చెప్పండి?
News March 9, 2026
HYD మెట్రో ‘భారం’.. ఆర్థిక సంక్షోభం!

హైదరాబాద్ మెట్రో మొదటి దశను ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకునే ప్రక్రియ ఈ మార్చి నాటికి తుది దశకు చేరుతుంది. సుమారు ₹13,000 కోట్ల అప్పులతో పాటు L&Tకి ₹2,000 కోట్ల సెటిల్మెంట్ చెల్లించేలా ఒప్పందం కుదిరింది. PPP మోడల్ విఫలమైందని అడ్మినిస్ట్రేషన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ, ప్రభుత్వంపై పడుతున్న ఈ భారీ ఆర్థిక భారం భవిష్యత్తులో సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.


