News February 12, 2025
గ్రేటర్ HYD లైబ్రరీల్లో సిబ్బంది కొరత..!

గ్రేటర్ HYDలోని అనేక గ్రంథాలయాల్లో ఇప్పటికి సిబ్బంది లేక తీవ్రంగా ఇబ్బందులు కలుగుతున్నట్లు పాఠకులు తెలుపుతున్నారు. సెంట్రల్ లైబ్రరీ సహా, HYD కేంద్రంగా ఉన్న అనేక గ్రంథాలయాల్లో తృతీయ శ్రేణి రికార్డు సహాయకులు సైతం లేరు. గ్రంథాలయాలలో ఉన్న ఖాళీలన్నింటిని నింపాలని విద్యార్థులు, పాఠకులు డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News November 14, 2025
కౌంటింగ్ షురూ..

బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ బైఎలక్షన్ కౌంటింగ్ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. జూబ్లీహిల్స్లో 2, 3 గంటల్లో ఫలితాల సరళి తెలియనుంది. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది. అటు బిహార్లో 2,616 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.
News November 14, 2025
ఈనెల 17న జాబ్ మేళా

AP: ఈనెల 17న పార్వతీపురం Employment Office ఆధ్వర్యంలో ఆన్లైన్ జాబ్ ఫెయిర్ నిర్వహించనున్నారు. 18ఏళ్లు పైబడిన టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇందులో పాల్గొనవచ్చు. మొత్తం 1150 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ముందుగా https://rb.gy/68z9mn లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
News November 14, 2025
భద్రాద్రి జిల్లాలో 45,681 మంది డయాబెటిస్ బాధితులు

భద్రాద్రి జిల్లాలో డయాబెటిస్ బాధితులు సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. జిల్లాలో వ్యాప్తంగా 5,19,760మందికి పరీక్షలు నిర్వహించగా 45,681 మందిని డయాబెటిస్ బాధితులుగా గుర్తించారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సుమారు 30శాతంపైగా డయాబెటిస్తో బాధపడుతున్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. ‘నేడు వరల్డ్ డయాబెటిస్ డే’


