News April 29, 2024

గ్లాసు గుర్తు పొందిన పసుపులేటి సుధాకర్

image

కావలి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసుపులేటి సుధాకర్‌కు గ్లాస్ గుర్తును కేటాయించారు. దీంతో పసుపులేటి సుధాకర్ అనుచరులు ఆనంద ఉత్సవాల్లో నిమగ్నమయ్యారు. జనసేన పోటీ చేయని ప్రాంతాల్లో గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్‌గా ఎన్నికల అధికారులు చూపిస్తున్నారు. పలువురు స్వతంత్ర అభ్యర్థులు గ్లాస్ సింబల్‌ను తమకు కేటాయించాలని కోరుకున్నారు.

Similar News

News April 12, 2026

నెల్లూరులో MPపై పోలీస్ కేసు నమోదు

image

నెల్లూరులోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ఈనెల 8న వైసీపీ నేతలు ఆందోళన చేశారు. సీఐ శ్రీనివాసరావు ఇతర పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకు అనుమతి లేదని చెప్పినా నేతలు పట్టించుకోలేదు. ఈక్రమంలో తమ విధులకు ఆటంకం కలిగించారని సీఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ మంత్రి కాకాణి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి తదితరులపై కేసు నమోదైంది.

News April 11, 2026

నెల్లూరు: తప్పిన పెను ప్రమాదం..!

image

ఆత్మకూరు బస్టాండ్ ఫ్లై ఓవర్ బ్రిడ్జికి రంగులు వేస్తున్నారు. కనీసం వాహనాల రాకపోకలను నివారించకుండా పెయింటింగ్ పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం పై నుంచి కింద నడుస్తున్న ఓ మహిళ, బాలుడిపై పెయింటింగ్ పడింది. ఆ సమయంలో ఇనుప రాడ్లు కానీ, పెయింట్ డబ్బాలు కానీ వారి మీద పడి ఉంటే.. పెను ప్రమాదం జరిగి ఉండేది. కేవలం పెయింట్ మాత్రమే వారిపై పడడంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు.