News February 26, 2026

గ్లోబల్ లీడర్‌గా మోదీ అరుదైన రికార్డు

image

ఇటు ఇజ్రాయెల్, అటు పాలస్తీనా.. పరస్పరం విరుద్ధమైన దేశాల నుంచి అత్యున్నత పురస్కారాలు అందుకున్న అరుదైన గ్లోబల్ లీడర్‌గా మోదీ నిలిచారు. తాజాగా ఇజ్రాయెల్ పార్లమెంటులో ‘స్పీకర్ ఆఫ్ ది క్నెసెట్ మెడల్’ను ప్రదానం చేశారు. 2018లో పాలస్తీనా ‘గ్రాండ్ కాలర్’తో సత్కరించింది. గొడవల్లో ఉన్న రెండు దేశాలను మెప్పించి ఇలాంటి గౌరవం పొందడం మోదీ దౌత్యనీతికి నిదర్శనమని విశ్లేషకులు కొనియాడుతున్నారు.

Similar News

News April 12, 2026

జులై 3 నుంచి అమర్‌నాథ్ యాత్ర

image

J&K అనంతనాగ్ జిల్లాలో గల అమర్‌నాథ్ యాత్ర జులై 3 నుంచి మొదలు కానుంది. 57 రోజుల పాటు జరిగే ఈ యాత్ర ఆగస్టు 28 న ముగియనున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు. శివుని ఆశీస్సులు కోరుతూ చేసే తొలి పూజను జూన్ 29న జ్యేష్ఠ పౌర్ణమి నాడు నిర్వహిస్తామన్నారు. ఈనెల 15 నుంచి <<19607867>>రిజిస్ట్రేషన్<<>> చేసుకోవచ్చు. 3,882 మీటర్ల ఎత్తులో ఉండే ఈ పుణ్యక్షేత్ర యాత్రకు మూడేళ్లలోపు, 70 ఏళ్లు పైబడినవారిని అనుమతించరు.

News April 12, 2026

ఏపీ ఇంటర్ ఫలితాలపై UPDATE

image

AP: ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలపై ఇంటర్ బోర్డ్ అప్‌డేట్ ఇచ్చింది. ఈ నెల 19 (ఆదివారం) లోపు ఫలితాలు విడుదల చేస్తామని Way2Newsతో చెప్పింది. ఇప్పటికే మూల్యాంకనం పూర్తి కాగా విడుదలకు ప్రాసెస్ కొనసాగుతోందని తెలిపింది. కాగా ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు జరిగిన ఈ పరీక్షలకు దాదాపు 10.50 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

News April 12, 2026

మహిళా రిజర్వేషన్ చట్టం.. ఫ్లోర్ లీడర్లకు మోదీ లేఖ

image

మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు టైమ్ వచ్చిందని PM మోదీ స్పష్టం చేశారు. 2029 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నుంచే కోటా అమల్లోకి వస్తుందని ఫ్లోర్ లీడర్లకు రాసిన లేఖలో వెల్లడించారు. ఈ చట్టానికి సంబంధించిన సవరణ బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించాలని MPలను కోరారు. ఏప్రిల్ 16 నుంచి 3రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు, MPలు హాజరు కావాలని BJP విప్ జారీ చేసింది.