News May 10, 2024
ఘంటసాలలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

కృష్ణా జిల్లా ఘంటసాల మండల పరిధిలోని దాలిపర్రు గ్రామ శివారులో ఉన్న జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఘంటసాల గ్రామం దిరిశం వాని గూడెంకు చెందిన కొక్కిలిగడ్డ ఇస్సాకు మృతిచెందాడు. మచిలీపట్నం నుంచి ఘంటసాల వస్తున్న క్రమంలో గుండెపోటు రావడంతో ఆటోలో నుంచి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. ఘటనపై ఎస్సై ప్రతాప్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 17, 2025
గన్నవరం: రేపు వల్లభనేని వంశీని కలవనున్న జగన్?

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని రేపు మాజీ సీఎం వైఎస్ జగన్ కలవనున్నట్లు తెలిసింది. బెంగళూరు నుంచి నేరుగా ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో విజయవాడ వెళ్ళనున్నారు. విజయవాడ సబ్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జగన్ పరామర్శించినట్లు సమాచారం. ఇటీవల వల్లభనేని వంశీ అరెస్టై రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే.
News February 17, 2025
తోట్లవల్లూరు: ‘రేడియం స్టిక్కర్లు లేక ప్రమాదాలు’

తోట్లవల్లూరుల్లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కండక్టర్ మృతి చెందిన విషయం తెలిసిందే. బైక్ మీద వెళ్తూ ఎడ్ల బండిని ఢీకొట్టడంతో స్పాట్‌లోనే మృతి చెందారు. ఎడ్ల బండ్లకు వెనుక రేడియం స్టిక్కర్స్ అంటించకపోవడంతో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదే ప్రాంతంలో ఈ తరహా ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందినట్లు పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
News February 16, 2025
తోట్లవల్లూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

తోట్లవల్లూరు మండలం యాకమూరు రైస్ మిల్లు వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డ్యూటీ ముగించుకొని బైక్‌పై వస్తున్న ఆర్టీసీ కండక్టర్ చీకుర్తి సురేష్ (47) వెనుక వైపు నుంచి ఎడ్ల బండిని ఢీ కొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.