News January 25, 2025
ఘట్కేసర్: ఆ ఒక్క నిర్ణయంతో.. రూ.52 వేలకు ఉద్యోగుల సంఖ్య..!

అన్నోజిగూడ సమీపాన సింగపూర్ టౌన్షిప్ వద్ద ఉన్న ఇన్ఫోసిస్ కంపెనీ విస్తరిస్తామని ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒక్క నిర్ణయంతో నిరుద్యోగులకు 17 వేల ఐటీ ఉద్యోగాలు లభించనుండగా, ప్రస్తుతం ఇన్ఫోసిస్ సంస్థలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 35 వేల నుంచి కాస్త 52 వేలకు చేరనుంది. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్లానింగ్ ప్రారంభించారు.
Similar News
News December 15, 2025
కాకాణి రిట్ పిటిషన్‌పై హైకోర్టు స్పందన

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వంలో తనపై నమోదు చేసిన కేసులపై సీబీఐ విచారణ చేపట్టాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖాలు చేశారు. గతంలో దీనిపై సీబీఐ విచారణ చేయించాలని సీఎంకు లేఖ రాసినా స్పందించలేదన్నారు. దీనిపై నోటీసులు జారీ చేసి.. ప్రతివాదుల స్పందన అనంతరం విచారణ చేపట్టి తగు నిర్ణయం తీసుకొనేందుకు హైకోర్ట్ 8 వారాలు వాయిదా వేసినట్లు కాకాణి ఒక ప్రకటనలో తెలిపారు.
News December 15, 2025
3వ విడత ఎన్నికకు పూర్తి స్థాయి ఏర్పాట్లు: ASF కలెక్టర్

2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 3వ విడత సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు జరగనున్న ఎన్నికలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు. సోమవారం ASF కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా 3వ విడత ఎన్నికల నిర్వహణపై ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి, కాగజ్ నగర్ మండలాల స్టేజ్ 2 ఆర్.ఓ.లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
News December 15, 2025
ఉద్యోగి రాజీనామా చేస్తే పెన్షన్‌కు అనర్హుడు: SC

ఉద్యోగి రాజీనామా చేస్తే అతని గత సర్వీసు రద్దవుతుందని, అలాంటి వారు ఫ్యామిలీ పెన్షన్‌కు అనర్హులని SC పేర్కొంది. ఉద్యోగి చేసిన రాజీనామాను ఆమోదించిన DTC PF మాత్రమే వస్తుందని, పెన్షన్ రాదని చెప్పింది. దీనిపై అతడు దావా వేయగా SC తాజా తీర్పు ఇచ్చింది. ‘VRకి పెన్షన్ వర్తిస్తుందన్నరూల్ ఉన్నా దానికి రిజైన్కీ తేడా ఉంది. రిజైన్తో పెన్షన్ రాదు’ అని పేర్కొంది. ఉద్యోగులకు ఈ తీర్పొక హెచ్చరికగా పలువురి సూచన.


