News February 18, 2025
ఘట్కేసర్ కొండాపూర్‌లో అనుమానాస్పద మృతి

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ PS పరిధి కొండాపూర్ సమీపంలోని ఓ కల్వర్టు వద్ద రూపాని వెంకన్న(49) అనే వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. మృతుడు నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. 2 రోజుల క్రితం పని కోసం మేడ్చల్ జిల్లా శామీర్‌పేటకు వచ్చిన రూపాని వెంకన్న మృతి చెందడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Similar News
News March 15, 2026
ఈనెల 15 నుంచి పశువులకు గాలికుంటు టీకాలు: కలెక్టర్

పెదమిరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకా ప్రచార గోడపత్రికను కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం ఆవిష్కరించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు నెల రోజుల పాటు జిల్లావ్యాప్తంగా ఉచితంగా టీకాలు వేయనున్నట్లు ఆమె తెలిపారు. పశుపోషకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారులు, జిల్లా సిబ్బంది పాల్గొన్నారు.
News March 15, 2026
నన్ను డ్రగ్స్ కేసులోకి లాగితే లీగల్ యాక్షన్ తప్పదు: KTR

TG: ప్రతీ డ్రగ్స్ కేసులోకి తనని లాగితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని KTR హెచ్చరించారు. ఎలాంటి టెస్ట్‌కైనా తాను సిద్ధమని పేర్కొన్నారు. డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చిన ప్రతీసారి BRS పార్టీని లాగడం దారుణమన్నారు. తాను, తమ పార్టీ డ్రగ్స్ వాడకానికి పూర్తి వ్యతిరేకమన్నారు. BRS Ex MLA పైలట్ <<19386182>>రోహిత్ రెడ్డి<<>> డ్రగ్స్ కేసులో చిక్కుకున్న నేపథ్యంలో KTR వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
News March 15, 2026
ఏలూరు: అక్షర ఆంధ్ర పరీక్షలను పరిశీలించిన కలెక్టర్

ఏలూరులోని శ్రీ సాయీశ్వరి మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం జరిగిన ‘అక్షర ఆంధ్ర’ తుది పరీక్షలను కలెక్టర్ వెట్రిసెల్వి పర్యవేక్షించారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 588 కేంద్రాల్లో 97,200 మంది వయోజన అభ్యాసకులు పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం 2,117 మంది సిబ్బందిని నియమించామని, అన్ని కేంద్రాల్లో అభ్యర్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించామని ఆమె వెల్లడించారు.


