News August 10, 2024

ఘనంగా పెంచలకోనలో కుంకుమార్చన 

image

రాపూర్ మండలంలోని పెంచలకోన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో శ్రావణమాసం మొదటి శుక్రవారం సందర్భంగా విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారికి అభిషేకం, సాయంత్రం ప్రాకారోత్సవం, సామూహిక కుంకుమర్చన సేవ తదితర పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మహిళా భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.

Similar News

News December 4, 2025

బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం: పీడీ

image

నెల్లూరును బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని ICDS పీడీ హేనా సుజన్ అన్నారు. గురువారం ఐసీడీఎస్ ప్రాజెక్టు ప్రాంగణంలో బాల్య వివాహ రహిత భారత్ కోసం 100 రోజుల అవగాహన కార్యక్రమన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అధికారులు, CDPOలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. ప్రతి శాఖ తమ పరిధిలో బాల్యవివాహాలను పూర్తిగా నిర్మూలించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

News December 4, 2025

కండలేరు జలాశయాన్ని పరిశీలించిన కలెక్టర్

image

దిత్వా తుఫాను నేపథ్యంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కండలేరు జలాశయాన్ని కలెక్టర్ హిమాన్షు శుక్లా గురువారం పరిశీలించారు. ప్రస్తుతం 60 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ ఎటువంటి ప్రమాదం లేదని ఎస్.ఈ.సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలిపారు. ఎగువ నుంచి వచ్చే వరద నీటిని నిరంతరం పర్యవేక్షించి, అవసరమైనప్పుడు నీటిని విడుదల చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమీప గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.

News December 4, 2025

నెల్లూరులో 5,198 మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌ నమోదు..!

image

లోక్ సభలో నెల్లూరు MP వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి AP, నెల్లూరులో SHG కింద ఉన్న మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌‌పై ప్రశ్నించారు. MSME పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సుశ్రీ శోభా కరండ్లాజే మాట్లాడుతూ.. MSME పరిశ్రమల రిజిస్ట్రేషన్‌‌కు ఉద్యమ్‌ రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను 1జులై2020న ప్రారంభించామన్నారు. అప్పటి నుంచి మైక్రో ఎంటర్‌ ప్రైజెస్‌ 30 నవంబర్ 2025 నాటికి APలో SHGల తరఫున 1,30,171, నెల్లూరులో 5,198 నమోదయ్యాయన్నారు.