News August 10, 2024
ఘనంగా పెంచలకోనలో కుంకుమార్చన
రాపూర్ మండలంలోని పెంచలకోన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో శ్రావణమాసం మొదటి శుక్రవారం సందర్భంగా విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారికి అభిషేకం, సాయంత్రం ప్రాకారోత్సవం, సామూహిక కుంకుమర్చన సేవ తదితర పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మహిళా భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
Similar News
News September 13, 2024
12న కనుపర్తిపాడులో జాబ్ మేళా
ఎన్నికల హామీల్లో భాగంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులో గురువారం ఆమె మాట్లాడుతూ .. కనుపర్తిపాడులోని వీపీఆర్ కన్వెన్షన్ హాలులో ఈనెల 14న శనివారం జాబ్ మేళా ఏర్పాటు చేశామని చెప్పారు. పలు సంస్థల ప్రతినిధులు వస్తారని.. నిరుద్యోగులు హాజరు కావాలని కోరారు.
News September 13, 2024
22న ముత్తూకూరులో భారీ బహిరంగ సభ
అదానీ కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ సాధన కోసం సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ పోరాటానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా ముత్తుకూరు సెంటర్‌లో ఈనెల 22వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు CITU ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ చేపట్టనున్నారు. అలాగే ఈనెల 16న నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
News September 13, 2024
నెల్లూరు: పరిశ్రమలకు త్వరలో భూమి కేటాయింపు
నెల్లూరులోని ఏపీఐఐసీ కార్యాలయంలో పరిశ్రమల యాజమానులతో సమీక్ష జరిగింది. ఆ సంస్థ జోనల్ మేనేజర్ శేఖర్ రెడ్డి మాట్లాడూతూ.. వెంకటాచలంలోని పారిశ్రామికవాడలో 41 మంది ప్రభుత్వం నుంచి స్థలం తీసుకుని నేటి వరకు పరిశ్రమలు ఏర్పాటు చేయలేదన్నారు. ఆయా స్థలాలను నూతన పరిశ్రమలకు త్వరలో కేటాయిస్తామన్నారు. ప్రస్తుతం అక్కడ నీటి వసతికి బోర్లు వేస్తున్నామని చెప్పారు.