News March 30, 2025

ఘనంగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

image

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో వసంతపక్ష శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల ప్రారంభం, ఉగాది పర్వదినం సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ముందుగా రక్షాబంధనం దీక్ష వస్త్రాల సమర్పణ లక్ష్మణ సమేత సీతారాములకు విశేష అభిషేకం నిర్వహించారు. భక్తులకు ఉగాది ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం అంకురార్పణ జరపనున్నారు.

Similar News

News October 24, 2025

ప్రైవేట్ బస్సులపై 565 కేసులు: మురళీ‌ మోహన్

image

తిరుపతిలో శుక్రవారం జిల్లా రవాణా అధికారి కొర్రపాటి మురళీమోహన్ నేతృత్వంలో సమీక్ష జరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు కాంట్రాక్ట్ క్యారేజీ బస్సులపై 565 కేసులు నమోదు చేసి రూ.42.95 లక్షలు వసూలు చేసినట్టు తెలిపారు. పర్మిట్ లేకుండా, పన్ను చెల్లించని వాహనాలపై చర్యలు తీసుకున్నామన్నారు. కర్నూలు బస్సు ప్రమాదం వేళ వాహనాల్లో అగ్నిమాపక పరికరాలు, అత్యవసర ద్వారాలు తప్పనిసరిగా తనిఖీ చేయాలని ఆదేశించారు.

News October 24, 2025

కల్వకుర్తి: బస్సు ప్రమాదం.. యువకుడి సాహసం

image

కర్నూలు వద్ద ప్రమాదానికి గురైన బస్సులో ప్రయాణిస్తున్న కల్వకుర్తి నియోజకవర్గం, మాడ్గుల మండలం చంద్రాయన్‌పల్లికి చెందిన అశోక్ (బీహెచ్‌ఈఎల్‌ ఉద్యోగి) ప్రాణాలతో బయటపడ్డాడు. తెల్లవారుజామున బస్సులో మంటలు వ్యాపించడాన్ని గమనించిన అశోక్.. వెంటనే కిటికీ అద్దాలు పగలగొట్టి అందులోంచి బయటపడి ప్రాణాలు కాపాడుకున్నాడు.

News October 24, 2025

భీమదేవరపల్లి: గేదెలను తప్పించబోయి కార్ పల్టీ

image

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ఎల్కతుర్తి నుంచి ముల్కనూర్ వైపు వెళ్తున్న కారు బోల్తా పడింది. రహదారిపై గేదెలు అకస్మాత్తుగా ఎదురుగా రావడంతో డ్రైవర్ అప్రమత్తమై వాటిని తప్పించబోయి కారు పల్టీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.