News February 25, 2025

ఘన్‌పూర్: సభను విజయవంతం చేయండి: మల్లు రవి

image

వచ్చే నెల 2న వనపర్తి కి సీఎం రేవంత్ రెడ్డి విచ్చేయుచున్నట్లు నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి తెలిపారు. వనపర్తి పట్టణ కేంద్రంలోని రూ.500 కోట్లతో లోన్ మేళా, జాబ్ మేళా, స్కిల్ డెవలప్ మెంట్ మేళాలకు బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Similar News

News September 16, 2025

అన్నమయ్య: ‘బొప్పాయి తక్కువకు అడిగితే కాల్ చేయండి’

image

అన్నమయ్య జిల్లాలో సెప్టెంబర్ 16వ తారీఖున టాప్ గ్రేడ్ బొప్పాయి ఎగుమతి ధర కిలో రూ.8లుగా నిర్ణయించబడిందని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పేర్కొన్నారు. సెకండ్ గ్రేట్ బొప్పాయి ఎగుమతి ధర కిలో రూ.7లుగా నిర్ణయించామని ఆయన అన్నారు. ఎవరైనా ట్రేడర్లు తక్కువ ధరకు కొనుగోలు చేస్తే వారిపై ఫిర్యాదు చేసేందుకు కంట్రోల్ రూమ్‌ నంబర్ (9573990331, 9030315951) సంప్రదించవచ్చని రైతులకు సూచించారు.

News September 16, 2025

పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ బదిలీ

image

పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ బదిలీ అయ్యారు. ఆయనను మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ, డ్రోన్ కార్పొరేషన్ ఎండీగా నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2022 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన శౌర్యమన్ పటేల్ శిక్షణ పూర్తయిన తరువాత పాడేరు సబ్ కలెక్టర్‌గా 2024 సెప్టెంబరులో నియమితులయ్యారు. అయితే ఆయన స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు.

News September 16, 2025

ప్రొద్దుటూరు చరిత్రలోనే కాస్ట్లీ ఎగ్జిబిషన్ ఇదే!.

image

ప్రొద్దుటూరు చరిత్రలోనే కాస్ట్లీ ఎగ్జిబిషన్‌తో మున్సిపాలిటీకి రూ.1,91,44,00లు, ఆర్థిక శాఖకు జీఎస్టీ రూపంలో రూ.34,45,920లు ఆదాయం లభించనుంది. మొత్తంగా ప్రభుత్వానికి రూ.2,25,89,920లు ఆదాయం సమకూరుతుంది. దసరా ఉత్సవాల్లో రెండవ మైసూరుగా పేరుగాంచిన ప్రొద్దుటూరులో ప్రతి దసరా సమయంలోనూ మున్సిపల్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. దీనివల్ల మున్సిపాలిటీకి, జీఎస్టీ శాఖకు ఆదాయం లభిస్తోంది.