News February 25, 2026

ఘోరం.. ఏడుస్తున్నాడని బిడ్డను నిప్పుల్లో వేసిన తల్లి

image

TG: బిడ్డ ఏడిస్తే ఓర్పుగా లాలించాల్సిన తల్లే సహనం కోల్పోయి దారుణానికి పాల్పడింది. 2 రోజులుగా బిడ్డ ఏడుస్తున్నాడనే కోపంతో 2 నెలల పసికందు నోట్లో గుడ్డలు కుక్కేసి, కాళ్లు, చేతులు కట్టేసి నిప్పుల్లో పడేసింది. దీంతో ఆ బిడ్డ సజీవ దహనమయ్యాడు. ఈ అమానవీయ ఘటన మేడ్చల్(D) దుండిగల్‌లో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి తల్లి మమత మానసిక స్థితిపై ఆరా తీస్తున్నారు. MPకి చెందిన ఈమె భర్తతో కలిసి వలస వచ్చింది.

Similar News

News April 15, 2026

విమాన వేంకటేశ్వర స్వామి ఎక్కడ ఉంటారు?

image

విమాన వేంకటేశ్వర స్వామి వారు శ్రీవారి ఆలయంలోని ఆనంద నిలయ గోపురం దక్షిణ భాగంలో దర్శనమిస్తారు. ఈ మూర్తి ఆలయ మూలవిరాట్టులాగే ఉంటుంది. శ్రీవారి భక్తుడైన తొండమాన్ చక్రవర్తి దీనిని ఏర్పాటు చేశారని వేంకటాచల మాహాత్మ్యం చెబుతోంది. భక్తులు సులభంగా దర్శించుకునేందుకు వీలుగా గోపురం వద్ద వెండి మకర తోరణం ఏర్పాటు చేశారు. అలాగే బాణం గుర్తు కూడా ఉంటుంది. ఈ స్వామివారిని దర్శించడం విశేషంగా భావిస్తారు.

News April 15, 2026

డీలిమిటేషన్ బిల్లు.. NDAకు మెజార్టీ ఉందా?

image

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుల రాజ్యాంగ సవరణల ఆమోదానికి లోక్‌సభలో 364మంది సభ్యుల మద్దతు అవసరం. NDAకు 293మంది MPలు ఉన్నారు. దీంతో కొన్ని ప్రతిపక్ష పార్టీలను ఒప్పించడానికి, చీల్చడానికి, గైర్హాజరు చేయించడానికి BJP యత్నిస్తోందని కొన్ని పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇక NDA పార్టీలన్నీ తమ MPలకు విప్ జారీ చేశాయి. ఉమెన్ రిజర్వేషన్ బిల్లు నేపథ్యంలో ఆయా పార్టీల మహిళా నేతలను LS గ్యాలరీకి రప్పిస్తున్నారు.

News April 15, 2026

BSNLలో 120 పోస్టులు.. నేటితో ముగియనున్న గడువు

image

BSNLలో 120 Sr. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి BE/BTech (EE & టెలికమ్యూనికేషన్స్/ఎలక్ట్రానిక్స్/ CS/IT/ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్), CA/CMA అర్హత గల వారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు సవరణకు రేపటి నుంచి 23వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. వయసు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తారు. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్: bsnl.co.in చూడండి.