News March 23, 2025
ఘోర ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు

భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామ శివారులో ఖమ్మం-అశ్వారావుపేట NHపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా లారీ, డీసీఎం వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ మృతి చెందగా, మరో ముగ్గురుకి తీవ్ర గాయాలయ్యాయి. ఎదురెదురుగా ఢీకొన్న వాహనాలు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ఆరు కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దమ్మపేట పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
Similar News
News January 8, 2026
‘సూర్యాపేట జిల్లాలో 10 వేల టన్నుల యూరియా నిల్వలు’

జిల్లాలో రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ప్రస్తుతం 10 వేల టన్నుల యూరియా నిల్వలు ఉన్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి తెలిపారు. గురువారం కోదాడ మండలంలోని పలు ఎరువుల దుకాణాలను ఆయన తనిఖీ చేసి, మాట్లాడారు. సొసైటీలు, ప్రైవేట్ డీలర్ల ద్వారా ఎరువుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని, ముందస్తుగానే అవసరమైన మేర యూరియా సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
News January 8, 2026
సిద్దిపేటపై సీపీ విజయకుమార్ చెరగని ముద్ర

సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్.విజయ్‌కుమార్ బదిలీ కావడం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. పదవీ కాలంలో ఆయన కేవలం శాంతిభద్రతలకే పరిమితం కాకుండా, ప్రజా సమస్యల పరిష్కారంలోనూ ప్రత్యేక ముద్ర వేశారు. ముఖ్యంగా ‘Way2News’లో వచ్చిన కథనాలకు తక్షణం స్పందిస్తూ సమస్యలను చక్కదిద్దారు. పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచిన ఆయన బదిలీ వార్తతో జిల్లా ప్రజలు ఒక్కసారిగా భావోద్వేగానికి గురవుతున్నారు.
News January 8, 2026
నిజామాబాద్: బయ్యర్ – సెల్లర్ మీటింగ్‌లో పసుపు బోర్డు ఛైర్మన్

మైసూర్‌లో జరిగిన బయ్యర్-సెల్లర్ మీటింగ్‌లో జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రైతుల ఆశలు, ఆశయాలకు కొత్త దిశ చూపిన హృదయస్పర్శి సమావేశంగా నిలిచిందన్నారు. తమ పంటలకు గిట్టుబాటు ధరలు, భవిష్యత్ మార్కెట్ అవకాశాలపై ఆశతో పెద్ద ఎత్తున హాజరైన రైతులు ఈ సమావేశానికి ప్రాణం పోశారని కొనియాడారు.


