News January 22, 2025
ఘోర ప్రమాదం.. మంత్రాలయం విద్యార్థుల మృతి

కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లాకు <<15220489>>చెందిన<<>> ఐదుగురు మరణించిన విషయం తెలిసిందే. మృతుల్లో ముగ్గురు మంత్రాలయం వేదపాఠశాలకు చెందిన విద్యార్థులు అభిలాష, హైవదన, సుజేంద్రగా గుర్తించారు. డ్రైవర్ శివ కూడా ప్రాణాలు కోల్పోయారు. నరహరితీర్థుల ఆరాధనోత్సవాలకు 14 మంది విద్యార్థులు మంత్రాలయం నుంచి హంపీకి బయలుదేరగా తుఫాన్ వాహనం బోల్తా పడి ఈ ఘటన జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 16, 2026
కర్నూలు: అనారోగ్యం బారిన పడినా.. ఇంటర్‌లో అద్భు ప్రతిభ

కర్నూలు(D) పెద్దకడుబూరుకు చెందిన బొగ్గుల హరిత ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచింది. వ్యవసాయ కూలీలు బొగ్గుల పరమేశ్, జ్యోతి దంపతుల కుమార్తె హరిత 6 నెలలుగా అనారోగ్యంతో బాధపడినా ధైర్యంగా కోలుకుని పరీక్షలకు హాజరై 1000 మార్కులకు 956 మార్కులు సాధించింది. ఆమె విజయంపై గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. హరిత భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు.
News April 16, 2026
2,078 మంది ఫెయిల్

ఇంటర్ ఫలితాలలో జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు 4,720 మంది పరీక్షలు రాయగా 2,078 మంది ఉత్తీర్ణత సాధించలేకపోయారని ఆర్ఐవో లాలప్ప తెలిపారు. జీజేసీ గర్ల్స్ 513 మందికి గాను 253, ఆదోని బాలికల కళాశాల 299 గాను 150, కోడుమూరు 125 మంది గాను 39, మంత్రాలయం 159 గాను 137, టౌన్ కళాశాల 609 మంది గాను 314, కోసిగి 111, నాగలదిన్నె 74, జీజేసీ బి.క్యాంప్ 128, ఆలూరు 148 మంది ఫెయిలయ్యారు.
News April 15, 2026
పీజీఆర్ఎస్ అర్జీలకు వేగవంత పరిష్కారం: కలెక్టర్

పీజీఆర్ఎస్‌లో వచ్చిన అర్జీలను వేగంగా, నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ ఏ.సిరి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతీ రోజు లాగిన్‌లో అర్జీలను పరిశీలించి, వెంటనే స్పందించాలని సూచించారు. ప్రజలకు పారదర్శక సేవలు అందించి సానుకూల స్పందన శాతాన్ని పెంచాలని తెలిపారు. జిల్లాలో 104 శాతం ఆదాయం సాధించడంపై ప్రశంసించారు.


