News April 14, 2025

ఘోర ప్రమాదానికి కారణమైన వాహనం స్వాధీనం

image

సత్యసాయి జిల్లా పరిగి మండలంలోని ధనాపురం వద్ద ఘోర ప్రమాదానికి కారణమైన వాహనాన్ని SI నరేంద్ర బెంగళూరులో స్వాధీనం చేసుకున్నారు. నిన్న ఉదయం ఆటోను ఐచర్ వాహనం ఢీకొనగా ముగ్గురు మహిళలు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఐచర్ వాహన డ్రైవర్ పరారై బెంగళూరులో తలదాచుకున్నాడు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్‌ఐ తమ సిబ్బందితో వెళ్లి వాహనాన్ని సీజ్ చేసి పరిగి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఘటనపై కేసు నమోదు చేశారు.

Similar News

News December 13, 2025

జుట్టుకు బలాన్నిచ్చే విటమిన్లివే..!

image

ప్రస్తుతకాలంలో కాలుష్యం, వాతావరణ మార్పుల వల్ల చాలామంది హెయిర్ ఫాల్‌తో బాధపడుతున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే ఆహారంలో ఈ విటమిన్లుండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. విటమిన్ బి7, విటమిన్ డి, ఐరన్, జింక్, విటమిన్ ఈ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఏ ఆహారంలో చేర్చుకోవాలి. వీటితో పాటు జీవనశైలి మార్పులు, వ్యాయామం, తగినంత నీరు తాగడం వంటివి చేస్తే పట్టులాంటి జుట్టు సొంతమవుతుందంటున్నారు.

News December 13, 2025

పాలమూరు: పదవి ఒకరిది.. పెత్తనం మరొకరిది..!

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గురువారం మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగాయి. రిజర్వేషన్ల కారణంగా అధిక శాతం మహిళలే గెలుపొందారు. ఈసారి గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అనుభవం లేని మహిళలు.. నిరక్షరాస్యులైన కొత్త వాళ్లు వార్డు సభ్యులు, సర్పంచ్‌గా గెలుపొందారు. వీరి పదవి అలంకారప్రాయమైన.. పెత్తనం మాత్రం భర్త, కుమారులది కొనసాగనుంది.

News December 13, 2025

పసుపులో ఆకుమచ్చ తెగులు – నివారణ

image

ఆకుమచ్చ తెగులు సోకిన పసుపు ఆకులపై చిన్నచిన్న పసుపు రంగు మచ్చలు ఏర్పడి అవి గోధుమ మచ్చలుగా మారతాయి. తెగులు తీవ్రమైతే ఆకు మాడిపోతుంది. దుంపలు, కొమ్ములు, మొక్కల ఎదుగుదల లోపించి దిగుబడి, నాణ్యత తగ్గుతుంది. ఈ తెగులు కట్టడికి లీటరు నీటికి మాంకోజెట్ 2.5 గ్రాములు లేదా కార్బండిజమ్ 1 గ్రాము లేదా ప్రోపికోనజోల్ 1mlను 0.5ml జిగురుతో కలిపి 15 రోజల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.