News January 29, 2025
ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి, కొడుకుల మృతి

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదోని బైపాస్ రోడ్డులో ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న తండ్రి, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. కాగా, మృతులది ఎమ్మిగనూరు మండలం కొట్టేకల్ గ్రామంగా గుర్తించారు.
Similar News
News November 21, 2025
NLG: డబుల్ లబ్ధిదారుల్లో.. 46 మంది అనర్హులు..!

నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లగూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో 46 మంది లబ్ధిదారులను అధికారులు అనర్హులుగా గుర్తించారు. వారి స్థానంలో ‘ప్రజా పాలన’ దరఖాస్తుల ద్వారా అర్హులైన వారిని పారదర్శకంగా డ్రా ద్వారా ఎంపిక చేశారు. మొత్తం 552 మంది లబ్ధిదారులకు త్వరలో ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు ఆర్డీవో అశోక్ రెడ్డి, హౌసింగ్ పీడీ రాజ్ కుమార్ తెలిపారు.
News November 21, 2025
టెట్ దరఖాస్తులకు మరో 3 రోజులే ఛాన్స్

AP: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) దరఖాస్తుల గడువు ఈ నెల 23తో ముగియనుంది. ఇప్పటివరకు 1,97,823 అప్లికేషన్లు వచ్చాయి. పురుషులు 66,104, మహిళలు 1,31,718 మంది దరఖాస్తు చేశారు. ఇన్ సర్వీస్ టీచర్లకూ TET తప్పనిసరి అని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 17,883 మంది టీచర్లూ టెట్కు అప్లై చేశారు. అయితే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలైనందున తమకు ఈ పరీక్ష నుంచి మినహాయింపు లభిస్తుందని టీచర్లు ఆశిస్తున్నారు.
News November 21, 2025
పల్నాడు వీరుల ఉత్సవాలలో నేడు మందపోరు

పల్నాడు వీరుల ఉత్సవాలలో మూడో రోజు శుక్రవారం మందపోరు నిర్వహించనున్నారు. మలిదేవ, బ్రహ్మన్న పరివారం అరణ్యవాస సమయంలో నల్లమల మండాది ప్రాంతంలో ఆవులను మేపేవారు. కుట్రతో నాగమ్మ వర్గీయులు ఆవులను వధిస్తారు. ఆవులు రక్షించుకునేందుకు లంకన్న భీకర యుద్ధం చేసి వీర మరణం పొందుతాడు. దీంతో బ్రహ్మనాయుడు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది. నాడు కుల మతాలకు అతీతంగా బ్రహ్మనాయుడు చేపట్టిన చాప కూడు సిద్ధాంతం నేటికీ కొనసాగుతోంది.


