News November 16, 2024

ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రీ, కొడుకు మృతి

image

చండ్రుగొండ మండలం తిప్పనపల్లి వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఎర్రుపాలెం మండలం కొత్తపాలెం ఆంజనేయస్వామి ఆలయంలో పురోహితుడిగా విధులు నిర్వహిస్తున్న సతీష్ కుమార్ శర్మ అతని భార్య లక్ష్మీ హిమబిందు, కుమారుడితో కొత్తగూడెం నుంచి విఎం బంజర వైపు వెళుతున్నారు. మార్గమధ్యలో ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో సతీష్ కుమార్, అతని కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు.

Similar News

News December 8, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ రేపు తిరిగి ప్రారంభం

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం నుంచి క్రయవిక్రయాలు పునః ప్రారంభం కానున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు ఆదివారం తెలిపారు. రెండు రోజుల సెలవులు అనంతరం సోమవారం మార్కెట్ ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ విషయాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగ సోదరులు గమనించి తమ పంటలను మార్కెట్‌కు తీసుకువచ్చి అమ్మకాలు జరపాలని అధికారులు పేర్కొన్నారు.

News December 8, 2024

మధ్యాహ్న భోజనం నాణ్యతను పెంచాలి: డీఈఓ  

image

మధ్యాహ్న భోజనం నాణ్యతను పెంచాలని, విద్యార్థుల ఆరోగ్యం పెంపొందటానికి పుష్టికరమైన ఆహారం చాలా అవసరమని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ శర్మ అన్నారు. ఖమ్మంలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో ఆదివారం నిర్వహించిన మధ్యాహ్న భోజన కుక్ కం హెల్పర్ల జిల్లా స్థాయి వంటలు పోటీలను ఆయన ప్రారంభించారు. పలు స్కూల్స్ కి చెందిన కుక్‌లు పాల్గొన్నారు.

News December 8, 2024

నార్వారిగూడెం వద్ద రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి 

image

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన అశ్వారావుపేట మండలంలో ఆదివారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్వారిగూడెం సమీపంలోని కోళ్ల ఫారం వద్ద లారీ-బైక్ ఢీకొన్న ఘటనలో బైక్‌పై వెళుతున్న ఇద్దరు చనిపోయారు. మరొకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని అశ్వారావుపేట అస్పత్రికి తరలించారు.