News October 26, 2024
ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ డ్రైవర్ సజీవదహనం

పెళ్లకూరు మండలం నాయుడుపేట-పూతలపట్టు జాతీయ రహదారి మార్గంలోని టెంకాయ తోపు గ్రామం వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కంటైనర్ లారీ ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ఈ ఘటనలో కంటైనర్ లారీ డ్రైవర్ ఫిరోజ్ మంటల్లో సజీవ దహనం అయ్యాడు. కంటైనర్ లారీ ముందు భాగం కాలిపోయింది.
Similar News
News September 10, 2025
గుడ్లూరులో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి

గుడ్లూరు ఉప్పుటేరు బ్రిడ్జి వద్ద బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ బ్రిడ్జి వద్ద ఆగి ఉన్న ఆటోను అటుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఆటో వద్ద నిలబడి ఉన్న ఇద్దరి మహిళలకు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను గుడ్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఓ మహిళ చికిత్స తీసుకుంటూ మృతి చెందింది. మరొకరు వైద్యం పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News September 10, 2025
వెంకటగిరి జాతర.. పోలేరమ్మ విగ్రహం ఇదే.!

వెంకటగిరి జాతర ఘనంగా జరుగుతోంది. ఇందులో భాగంగా అమ్మవారి పుట్టినిల్లు కుమ్మరి వాళ్ల ఇంట ప్రతిమ సిద్ధం చేశారు. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ దంపతులు తొలిపూజ చేశారు. మరికాసేపట్లో అమ్మవారిని జీనిగల వారి వీధిలోని చాకలి మండపానికి తీసుకెళ్లనున్నారు. అక్కడే దిష్టి చుక్క, కళ్లు పెడుతారు. ఆ తర్వాత ఊరేగింపుగా అమ్మవారి ప్రధాన ఆలయానికి తీసుకెళ్లి ప్రతిష్ఠిస్తారు. గురువారం సాయంత్రం నిమజ్జనం జరగనుంది.
News September 10, 2025
‘క్రియేటివిటీ మీ సొంతమా.. దరఖాస్తు చేసుకోండి’

27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నెల్లూరు(D)లోని ఆ శాఖా ఆధ్వర్యంలో ఫొటోగ్రఫీ, ప్రత్యేకమైన వీడియోల పోటీలకు జిల్లా పర్యాటక అధికారి ఉషశ్రీ ఓ ప్రకటన విడుదల చేశారు. చూడదగిన ప్రదేశాలు, సాంస్కృతిక వారసత్వ కోటలు, జలపాతాలు, ఈకో-టూరిజం, స్థానిక వంటకాలు తదితరాలను ప్రోత్సహించేలా సృజనాత్మకత ఉన్న వారు ఈ పోటీలకు అర్హులన్నారు. వివరాలకు 94936 68022, 77807 49802 నంబర్లకు 20వ తేదీలోపు సంప్రదించాలన్నారు.