News March 18, 2025
చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన జర్నలిస్టులు

చంచల్‌గూడ జైలులో ఉన్న యూట్యూబ్ జర్నలిస్టులు తన్వి యాదవ్, రేవతిలు విడుదలయ్యారు. సోమవారం నాంపల్లి కోర్టు యూట్యూబ్ జర్నలిస్టులకు రూ.25వేల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది. కాగా.. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై యూట్యూబ్ జర్నలిస్టులు తమ ఛానల్లో ప్రసారం చేసిన ఓ వీడియోపై రిమాండ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే.
Similar News
News March 19, 2025
హైదరాబాద్‌లో ముంచుకొస్తున్న ముప్పు!

HYDకు ముప్పు ముంచుకొస్తోంది. ఈ వేసవిలో నీటి కొరత ఏర్పడే పరిస్థితి ఉంది. భూగర్భ జలాలు క్రమంగా తగ్గుతున్నాయి. ORR వరకు 948 చ.కిమీ మేర ఏకంగా 921 చ. కిమీ మేర భూగర్భ జలాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు జలమండలి నివేదికలో వెల్లడైంది. ప్రతిరోజు దాదాపు 11 వేల ట్యాంకర్లను నగరవాసులు బుక్ చేసుకుంటున్నారు. IT కారిడార్, కూకట్‌పల్లి, మాదాపూర్, శేరిలింగంపల్లి వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది.
News March 18, 2025
రంగారెడ్డి: 2nd ఇయర్ పరీక్షకు 2,399 మంది డుమ్మా

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ 2nd ఇయర్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 185 కేంద్రాల్లో 73,192 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా.. 70,793 మంది విద్యార్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. 2,399 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారన్నారు. జిల్లావ్యాప్తంగా ఒక్క మాల్ ప్రాక్టీస్ కేసు కూడా నమోదు కాలేదన్నారు.
News March 18, 2025
HYD: ఇంటర్ ఎగ్జామ్ రాస్తున్న అమ్మాయికి Fits

ఇంటర్ పరీక్ష రాస్తున్న విద్యార్థిని అస్వస్థతకు గురైంది. కీసర శ్రద్ధ కళాశాలలో ఎకనామిక్ పరీక్ష జరుగుతోంది. హాల్‌కు వచ్చిన విద్యార్థిని ప్రవళిక పరీక్ష రాస్తుండగా ఫిట్స్ రావడంతో కుప్పకూలిపోయింది. అప్రమత్తమైన సిబ్బంది పక్కనే ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించి, ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నాచారం ESIకి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం ప్రవళిక ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.