News March 3, 2025

చండీగఢ్‌లో ఘనంగా నంద్యాల ఎస్పీ వివాహం

image

నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా వివాహ వేడుకలు చండీగఢ్‌లో ఆదివారం ఘనంగా జరిగాయి. మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, NMD ఫరూక్, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తదితరులు ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.

Similar News

News October 19, 2025

పెద్దపల్లి: కాల్చకుండానే పేలుతున్న పటాకుల ధరలు..!

image

జిల్లాలో దీపావళి పటాకుల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. టపాసులపై GST, కెమికల్స్ ధరలు తగ్గినా ధరలు మాత్రం దిగలేదు. చిన్నాపెద్దా తేడా లేకుండా కాల్చే కాకరపుల్లల ధరలు సైతం గతంతో పోలిస్తే భారీగా పెరిగాయి. ఒక్కోదాని కుల్లా ప్యాకెట్ ధర రూ.40 నుంచి రూ.220 వరకు పలుకుతోంది. చిచ్చుబుడ్డులు, లక్ష్మీ, సుతిల్ బాంబులతో పాటు ఇతర టపాసుల ధరలు పేల్చకుండానే వణుకు పుట్టిస్తున్నాయి. మరి మీ ఏరియాలో రేట్లెలా ఉన్నాయో COMMENT.

News October 19, 2025

మెదక్: పాతూరు సబ్‌స్టేషన్‌ను సందర్శించిన కలెక్టర్

image

మెదక్ మండలం పాతూరు సబ్‌స్టేషన్‌ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. విద్యుత్ సరఫరా తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగేలా, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా రైతులకు ఇబ్బందులు కలగకుండా నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

News October 19, 2025

లైసెన్స్ ఉన్న దుకాణదారుల వద్ద బాణాసంచా కొనాలి: SP

image

లైసెన్స్ కలిగిన దుకాణదారుల వద్ద మాత్రమే బాణాసంచా కొనుగోలుచేయాలని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ చెప్పారు. ఆదివారం మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా దీపావళి టపాసులు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు టపాసులు పేల్చే సమయంలో జాగ్రత్త వహించాలని గాజు సీసాలు, ఇనప రేకులతో కూడిన పాత్రల్లో టపాసులు పేల్చరాదని తెలిపారు. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ పండగను ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు.