News March 3, 2025
చండీగఢ్‌లో ఘనంగా నంద్యాల ఎస్పీ వివాహం

నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా వివాహ వేడుకలు చండీగఢ్‌లో ఆదివారం ఘనంగా జరిగాయి. మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, NMD ఫరూక్, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తదితరులు ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.
Similar News
News March 27, 2025
పిఠాపురం నియోజకవర్గంలో రికార్డింగ్ డాన్సులు

AP: Dy.CM పవన్ నియోజకవర్గమైన పిఠాపురంలోని మూలపేటలో రికార్డింగ్ డాన్సుల వీడియో SMలో వైరలవుతోంది. అమ్మవారి జాతర సందర్భంగా అర్ధరాత్రి అమ్మాయిలతో అసభ్యకరంగా నృత్యాలు చేయించారు. ఓ వైపు టెన్త్ పరీక్షలు జరుగుతుంటే ఇలాంటి డాన్సులు ఏర్పాటు చేయడం ఏంటని గ్రామస్థులు మండిపడుతున్నారు. పవన్ స్పందించి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మా గైడ్‌లైన్స్ ప్రకారం ఆ <
News March 27, 2025
రోహిత్‌ను రోజూ 20KM పరిగెత్తమని చెప్తా: యువరాజ్ తండ్రి

దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను టీమ్ ఇండియాకు కోచ్‌గా నియమిస్తే రోహిత్ శర్మను రోజూ 20KM పరిగెత్తమని చెప్తానని అన్నారు. ప్రస్తుత ఆటగాళ్లతోనే ఎప్పటికీ ఓడించలేని జట్టుగా మారుస్తానని ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు. రోహిత్, కోహ్లీని రంజీ ట్రోఫీలో ఆడించాలన్నారు. వారిద్దరూ వజ్రాల్లాంటి ప్లేయర్లని కొనియాడారు.
News March 27, 2025
ఉప్పల్‌లో SRH, మహేశ్ బాబు FANS

ఉప్పల్ స్టేడియం వద్ద SRH, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. వరంగల్, ఖమ్మం ప్రాంతాలకు చెందిన పలువురు యువత ఆరెంజ్ ఆర్మీ టీషర్ట్స్, మహేశ్ బాబు బ్యానర్‌తో స్టేడియానికి చేరుకున్నారు. ఈ సారి SRH బ్యాటింగ్‌కు దిగితే 300 స్కోర్ చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి క్రికెట్ ఫ్యాన్స్ రావడంతో స్టేడియం పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.