News November 16, 2024
చండ్రుగొండ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం

చండ్రుగొండ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కొత్తగూడెం నుంచి బైక్పై వస్తున్న ఓ కుటుంబం తిప్పనపల్లి వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి ట్రాక్టర్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 2, 2026
పరీక్షలంటే భయం వద్దు: కలెక్టర్

పదో తరగతి విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా, ప్రశాంత చిత్తంతో పరీక్షలకు సిద్ధం కావాలని కలెక్టర్ అనుదీప్ పిలుపునిచ్చారు. సోమవారం ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక మోటివేషన్ కార్యక్రమంలో మాట్లాడారు.పరీక్షల పట్ల భయం పెంచుకుంటే ఉన్న సమయాన్ని వృథా చేసుకోవడమే కాకుండా, తెలిసిన విషయాలను కూడా మర్చిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
News March 2, 2026
ఖమ్మం: బాలికలకు ఉచితంగా హెచ్పీవీ వ్యాక్సిన్

గర్భాశయ క్యాన్సర్ నివారణకు 14-15 ఏళ్ల బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఖమ్మం జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. మార్చి 4న జీజీహెచ్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. జిల్లాలో 14 వేల మంది బాలికలను గుర్తించి, 7 ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు వేయనున్నారు. మార్కెట్లో రూ.3,500 విలువ చేసే ఈ టీకాను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది.
News March 2, 2026
ఖమ్మం: రైతు భరోసా కోసం ఎదురుచూపులు

రైతు భరోసా పథకం అమలు కోసం ప్రభుత్వం నిధుల విడుదలకు పచ్చజెండా ఊపినట్లు ప్రకటనలు వచ్చినా, క్షేత్రస్థాయిలో జాప్యం జరుగుతోంది. ఏటా ఎకరానికి రూ.15 వేలు ఇస్తామన్న హామీ ప్రకటనలకే పరిమితమైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిధుల కొరతతో పెట్టుబడి సాయం అందక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వెంటనే నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.


